Ismart Shankar: రామ్ పోతినేని హీరోగా సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘డబల్ ఇస్మార్ట్’. ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతూ ఉండగా ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ సినిమాకు రిలీజ్ ముంగిట తలనొప్పులు తప్పవని ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ఈ చిత్రం యొక్క దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ కు సంబంధించిన లావాదేవీల తలనొప్పులు ఈ చిత్రాన్ని చుట్టుకున్నాయి.
Puri jagannadh movie ismart shankar release problems
లీగల్ గా చూస్తే దర్శక నిర్మాతలు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు.. కానీ ఆ సినిమా మరింత దారుణంగా భారీ నష్టాన్ని సమకూర్చిన నేపథ్యంలో బయ్యర్ల ను ఆదుకోవాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉందని చెప్పాలి. గత కొన్ని రోజులగా దీనికి సంబంధించిన పంచాయతీ నడుస్తూ ఉండగా దీనిపట్ల ఈ సినిమా యొక్క దర్శక నిర్మాతలు ఎవరు స్పందించకపోవడం ఈ సినిమా విడుదలను ఆపేయాలని బయ్యర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.
Also Read: Tollywood: నాని, విశ్వక్, సిద్ధు.. వీళ్ళ మీద అన్ని కోట్ల వర్క్ అవుట్ అయ్యేనా!!
సినిమాలో కంటెంట్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇస్మార్ట్ శంకర్ అనుకోకుండా హిట్ అయిన చిత్రం. ఆ తర్వాత ‘లైగర్’ సినిమా చేశాడు పూరి జగన్నాథ్. ఆ సినిమా పూరి ఇమేజ్ ను ఎంతగా డ్యామేజ్ చేసినదో చెప్పనవసరం లేదు. ఇప్పుడు దాదాపు 60 కోట్లు పెట్టి తీసిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఎంతవరకు రికవరీ అవుతుందనేది చూడాలి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ గొప్పగా అయితే లేదు.. పాటలు నిరాశపరిచాయి టీజర్ పరవాలేదనిపించింది.. దీనికి పోటీగా వస్తున్న మరొక సినిమా యొక్క కంటెంట్ తో పోలిస్తే ఇది చాలా పూర్ గా ఉందని అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలోనే ఈ సినిమా అన్ని దాటుకుని విడుదలై అనుకున్న కలెక్షన్లను సంపాదిస్తుందా అనేదే ఇక్కడ అసలు విషయం.. సినిమాకు బాగా హైప్ ఇచ్చి విడుదల చేయడం మంచిదని కనీసం ఓపెనింగ్ కలెక్షన్లు అయినా గట్టిగా వస్తాయని అంటున్నారు.