Pushpa 2 Pre-Sales Cross $50,000 in the US

Pushpa 2: పుష్ప 2 సినిమాపై ఉన్న ఉత్కంఠతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ విశేష విజయాన్ని సాధించి పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు, “పుష్ప 2: ది రూల్” విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా, అభిమానులు వేయి కళ్ళతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Pushpa 2 Pre-Sales Cross $50,000 in the US

విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే అమెరికాలో పుష్ప 2 జోరు ప్రారంభమైంది. కొన్ని ప్రముఖ సినిమార్క్ థియేటర్లలో ఇప్పటికే 50,000 డాలర్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు 554 షోలకు బుకింగ్స్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో తెలుగు భాషలో 328, హిందీ భాషలో 208, తమిళంలో 12, మలయాళంలో 2, కన్నడలో 4 షోలు ఉన్నాయి. PLF, IMAX వంటి ప్రత్యేక స్క్రీనింగ్‌లతో పూర్తిస్థాయి బుకింగ్స్ నవంబర్ 4 నుంచి ప్రారంభమవుతాయి.

Also Read: Pushpa 2: పుష్ప ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్.. బాక్స్ బద్దలే!!

మొదటి భాగం బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో, పుష్ప 2 పై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు, దేవర, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ సినిమాల మధ్యన కూడా ఈ సినిమాకు ప్రత్యేకమైన ఓపెనింగ్ యాడ్వాంటేజ్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి భాగం ఉత్తరాదిలో కూడా అద్భుతమైన వసూళ్లు సాధించడంతో, రెండో భాగానికి దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ ఉంటుందన్న నమ్మకం నెలకొంది. అమెరికాలో ప్రారంభమైన ఈ వేడుకతో, పుష్ప 2 మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశాలపై పరిశ్రమలో చర్చలు సాగుతున్నాయి.

పుష్ప 2 డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, అమెరికాలో ప్రీమియర్స్ డిసెంబర్ 4నే జరగనున్నాయి. మొద ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు, కానీ ఐదు రోజుల వీకెండ్ సాలిడ్ ఓపెనింగ్స్ కోసం డిసెంబర్ 4 బుధవారం ప్రీమియర్లను నిర్ణయించారు. పుష్ప 2 మొదటి భాగానికి తగిన సీక్వెల్ గా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి, కానీ ఇప్పటి వరకు ఉన్న హైప్ చూస్తే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

https://twitter.com/pakkafilmy007/status/1852617706157265227