Radhika: విశాల్ పై రాధిక షాకింగ్ కామెంట్లు చేసింది. చెప్పుతో కొట్టాలంటూ ఆయన మాట్లాడిన మాటలు సబబేనా.. అంటూ రాధిక మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. అసలు రాధిక ఎందుకు అలా మాట్లాడింది. విశాల్ మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం. విశాల్ రీసెంట్గా మాలీవుడ్లో వేసిన హేమ కమిటీ రిపోర్ట్ పై అలాంటి కోరికలు తీర్చాలి అని అడిగే వారిని చెప్పుతో కొట్టాలి అంటూ నటీమణులకు చెప్పారు.
Radhika comments on Vishal
అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన రాధిక అసలు మీరు ఓ సంఘానికి నాయకులేనా.. నాయకులై ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా.. అసలు నాయకుడికి ఉండే లక్షణాలు ఇవేనా.. ఎవరైనా నాయకుడు తమ కింద ఉండే వారికి ఇబ్బందులు వస్తే మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటో నాకు చెప్పండి. మీరు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా వారిపై నేను రియాక్షన్ తీసుకుంటాను అని చెప్పాలి.(Radhika)
Also Read: Radhika: కారవాన్ లో రహస్య వీడియోలు.. బట్టలు మార్చుకుంటుండగా నగ్న వీడియోలు..?
కానీ అలాంటిది మీరే చెప్పుతో కొట్టండి అంటూ మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్దపెద్ద వాళ్ళు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారిని వేధిస్తూ ఉంటారు. అలాంటి వారిని చెప్పుతో కొట్టి మళ్లీ ఆ అమ్మాయిలు ఇండస్ట్రీలో తిరగగలరా.. వారిని అసలు ఇండస్ట్రీలో ఉండనిస్తారా..
అంటూ రాధిక విశాల్ పై ఫైర్ అయింది. అంతేకాదు ఎంతోమంది పెద్దవాళ్లు అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు.మరి వారిని చెప్పుతో కొట్టే దమ్ము నీకుందా.. ముందు నటినటులు అందరూ నిర్మాతలు ఇలా అందరూ ఏకమై రండి.. మనమందరం కలిసి పోరాడుదాం. వారికి సపోర్ట్ గా ఉందాం..అంటూ విశాల్ కి కౌంటర్ ఇచ్చింది రాధిక.(Radhika)