Radhika: మాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు భూకంపం సృష్టిస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటికి వచ్చి వారికి ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నటీమణులు దర్శకులపై నటులపై సంచలన ఆరోపణలు చేశారు.అయితే తాజాగా సీనియర్ నటి రాధిక కూడా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. కారవాన్ లో రహస్య కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు తీస్తారు అంటూ ఆమె మాట్లాడిన మాటలు మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.
Radhika: Secret videos in the caravan
మరి ఇంతకీ రాధిక అలా ఎందుకు మాట్లాడింది.రాధిక కి కూడా అలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయిందా.. అనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ నటి రాధిక తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించి వయసు మీద పడడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.అలా ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి,అత్త,పిన్ని వంటి పాత్రలను పోషిస్తూ ఇప్పటికి ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా మాలివుడ్లో హేమ కమిటీ రిపోర్ట్ కి మద్దతు పలుకుతూ ఓ విషయాన్నీ బయటపెట్టింది. (Radhika)
Also Read: Balakrishna: అన్నదమ్ములకు అందని ఆహ్వానం..బాలయ్య ఆ హీరోలపై అంత పగ పెంచుకున్నారా.?
కారవాన్ లో బట్టలు మార్చుకునే సమయంలో కొంతమంది సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. రాధిక మాట్లాడుతూ..నేను ఓసారి సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లే సమయంలో కొంతమంది అబ్బాయిలు ఒక దగ్గర కూర్చుని ఫోన్లో వీడియోలు చూస్తూ తెగ నవ్వకుంటున్నారు. అయితే అదేంటి అని షూటింగ్ సెట్ లోని కొంతమందిని అడిగితే కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుండగా నగ్న వీడియోలు షూట్ చేసి వాటిని చూస్తున్నారు అని చెప్పడంతో నేను చిత్ర యూనిట్ పై ఫైర్ అయ్యాను.
అంతేకాదు నా టీం కి కూడా కారవాన్ లో ఎలాంటి కెమెరాలు కనిపించకూడదు. కనిపిస్తే మాత్రం బాగుండదని వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత నాకు కేరవాన్ అంటే భయమేసింది.అక్కడ బట్టలు మార్చుకోవాలంటే భయమేసి హోటల్ రూమ్లలో బట్టలు మార్చుకునేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది రాధిక.(Radhika)