Rahul Drvaid: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు కోచ్ గా తన పేరు ఉండడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మనే అని రాహుల్ ద్రావిడ్ అన్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ద్రావిడ్ అసలు ఇలా ఎందుకు అన్నాడంటే…. 2023లో వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సొంత గడ్డపై చివరి అడుగులో కప్ కోల్పోవడంతో రాహుల్ ద్రవిడ్ చాలా బాధపడ్డారు. Rahul Drvaid
rahul dravid recalls rohit sharma phone call
ఇక కోచింగ్ చాలు అనుకొని తన కోచ్ పదవికి రాజీనామా కూడా చేయాలని డిసైడ్ అయ్యారట. ఎందుకంటే ఒక ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ కూడా ఐసీసీ ట్రోఫీని అందుకోలేదు. దీంతో కోచ్ గా అయినా సరే ఆ కలను నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. ఇన్నేళ్లు ఇండియాకు కోచ్గా ఉండి ఆ టీం ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ నమ్మకంతో ఈయన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడం కాదు. కోచ్ పదవే ఇతడిని వరించింది. కోచ్ గా అనిల్, రవి శాస్త్రిల టైం పీరియడ్ లో కొన్ని సమస్యలు తలెత్తాయి. Rahul Drvaid
Also Read: Surya kumar Yadav: సూర్య తొండాట…అందుకే టీమిండియా గెలిచిందా ?
అటువంటి సమయంలో వాటన్నింటినీ అధిగమిస్తూ టీమ్ ఇండియాను మునుపటిలా స్ట్రాంగ్ గా నిలబెట్టే సత్తా రాహుల్ ద్రవిడ్ కే ఉందని బీసీసీఐ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. దీంతో వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత ఇంతటి నమ్మకాన్ని నేను వమ్ము చేశానన్న బాధలో రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. కానీ ఆ సమయంలో రోహిత్ శర్మనే అండగా నిలబడ్డారని ద్రావిడ్ అన్నారు. మ్యాచ్లో విజయాలు, అపజయాలు చాలా కామన్. కానీ మీ సేవలు టీ20 వరల్డ్ కప్ వరకు అవసరం. Rahul Drvaid
కనీసం అప్పటివరకైనా మీరు కొనసాగండి అని రోహిత్ శర్మ రాహుల్ ద్రవీడ్ కు ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు అతడు తన మనసును మార్చుకున్నాడట. ఒక కెప్టెన్, కోచ్ మధ్య భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ రోహిత్ తో మాత్రం పర్సనల్గా బాండింగ్ వేరే లెవెల్లో ఉంది అన్నట్టుగా రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చారు. రోహిత్,రాహుల్ కు మధ్య అంత మంచి బాండింగ్ ఉన్నందుకే కదా కొన్నాళ్లుగా గ్రౌండ్ లో అయినా డ్రెస్సింగ్ రూమ్ లో నైనా అద్భుతమైన వాతావరణం ఆటగాళ్ల మధ్యలో ఏర్పడింది. Rahul Drvaid