Raj Tarun: వరుస మంచి సినిమాలతో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరో గా నటించిన తాజా చిత్రం “పురుషోత్తముడు” చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే వచ్చిన అప్డేట్ లతో ఆకట్టుకోగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.ఈ సినిమా లో హాసినీ సుధీర్ హీరోయిన్గా నటించగా ప్రకాష్ రాజ్, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించడం విశేషం. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్ పతాకంపై డా రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు.
కథ: విదేశాల్లో చదువుకుని వచ్చిన రామ్ (రాజ్ తరుణ్) కుటుంబానికి కొన్ని వ్యాపారాలు ఉంటాయి. అయితే దానికి సీఈఓ చేయడానికి రామ్ కు, అతని పెద్ద కొడుకుకు పోటీ నెలకొంటుంది.అయితే మ్ విదేశాల్లో పెరిగిన నేపథ్యంలో ఇక్కడ విషయాలు తెలియవు, అవగాహన లేదు, ఇంత పెద్ద పోస్ట్ కి అర్హుడు కాదని అనడంతో సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లి అక్కడి స్థితిగతులు తెలుసుకోవాలని చెబుతుంది.ఇక ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. దీంతో రచిత్ రామ్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంక అనే పల్లెటూరికి చేరుకుంటాడు. అక్కడ జరిగిన పరిస్థితులేంటి.. సీఈఓ గా రామ్ బాధ్యతలు చేపడతాడా అనేది చూడాలి.
నటీనటులు: రచిత్ రామ్ పాత్రకు రాజ్ తరుణ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. సినిమాను తన భుజంపై వేసుకుని నడిపించాడు. గత సినిమా తో పోలిస్తే ఈ హీరో మంచి పరిణితి కనపరిచారు.ఇక పల్లెటూరి యువతిగా హాసిని సుధీర్ చేసిన పాత్ర ఆకట్టుకుంది. ఎంతో చలాకి గా కనిపించింది. హీరోయిన్ పాత్ర కు సరిగ్గా సూట్ అయ్యింది. రమ్యకృష్ణ ఈ సినిమా కే హైలైట్. చాలా బాగా సినిమా లో ఆకట్టుకుంది. మురళీ శర్మ ఎప్పటిలాగే తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో ప్రవీణ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. సత్య మరియు బ్రహ్మానందం ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం స్క్రీన్ స్పేస్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు: టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే.. ఫొటోగ్రాఫర్ పీజీ విందా పల్లెటూరి అందాలను చాలా అద్భుతంగా చూపించారు.. గోపీ సుందర్ అందించిన ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.సినిమా కథను కొత్తగా రాసుకున్నాడు. కథనం కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా లో పలు సినిమాల రిఫరెన్స్ లు కనిపించాయని చెప్పాలి. అయినా రాజ్ తరుణ్ వాటి తాలుకు రెఫరెన్సు లేకుండా కాపాడాడు. ఇక నిర్మాణ విలువల విషయంలోనూ నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్ :
రాజ్ తరుణ్ నటన
ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
స్లో నెరేషన్
సెకండాఫ్
తీర్పు : పురుషోత్తముడు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చొచ్చు.
Rating: 3/5