Raj Tarun: ప్రస్తుతం మీడియా మొత్తం హీరో రాజ్ తరుణ్ పేరే వైరల్ అవుతుంది. ఆయన లావణ్య అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి చివరికి 11 ఏళ్ల రిలేషన్ ని పక్కన పెట్టి మరో హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ తనని దూరం పెట్టాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది లావణ్య. దీంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 11 సంవత్సరాలుగా లావణ్య అనే యువతిని ప్రేమించి ఆమెతో లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారట.
Raj Tarun wanted to get rid of Lavanya for that one reason
అంతేకాదు ఈ జంట గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా లావణ్య పోలీసులకు చూపించింది. కానీ ఉన్నట్టుండి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ప్రేమలో పడి అడ్డుగా ఉన్నానని తనని దూరం పెట్టాలని చూస్తున్నాడనే ఆరోపణలు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్ ని వదిలి పెట్టకపోతే నిన్ను చంపేస్తా నువ్వు భూమ్మీదే ఉండవు అంటూ ఆ హీరోయిన్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడు కూడా భయభ్రాంతులకు గురి చేశారట.(Raj Tarun)
Also Read: Raj Tarun: లావణ్య కు వేరే వ్యక్తితో ఎఫై**.. ఆమె చేసిన మోసానికి లైఫ్ లో పెళ్లే చేసుకోను.!
దీంతో దిక్కుతోచని స్థితిలో లావణ్య పోలీసులను ఆశ్రయించిందట. అయితే గత కొద్దిరోజుల ముందు లావణ్య పేరు డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది.సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరో లవర్ డ్రగ్స్ కేసులో మెయిన్ నిందితురాలుగా ఉంది అని కూడా టాక్ వినిపించింది. అలాగే డ్రగ్స్ తో కూడా అతనికి ఎలాంటి సంబంధం లేదని, కానీ కావాలనే కొంతమంది ఇందులో ఇరికించారంటూ లావణ్య మీడియాతో చెప్పింది.
అయితే 11 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న లావణ్యని రాజ్ తరుణ్ దూరం పెట్టడానికి ఒకే ఒక్క కారణం ఉందనే రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే లావణ్య డ్రగ్స్ తీసుకోవడం వల్లనే రాజ్ తరుణ్ ఆమెని దూరం పెట్టాడని కొద్ది కొద్ది రోజులుగా డ్రగ్స్ విషయంలోనే రాజ్ తరుణ్ కి లావణ్య కి మధ్య మాట మాట పెరిగి చివరికి ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇక ఎప్పుడైతే లావణ్యతో గొడవలు అయ్యాయో అప్పటినుండి మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ తో ప్రేమలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.(Raj Tarun)