Raja Sekhar: యాంగ్రీ మ్యాన్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో ఎంతో మంచి పేరు గడించిన హీరో రాజశేఖర్. అయితే ఒకప్పుడు ఈయన చిరంజీవి తరం హీరోలకు పోటీ ఇచ్చి మరీ సినిమాలు చేసేవారు.ఒకానొక సమయంలో ఈయన చేసిన సినిమాలు ఆ హీరోల కంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ అయ్యేవి.కానీ ఆ తర్వాత ఈయనకు వరుస ఫ్లాపులు ఎదురవడంతో సినిమాల్లో అవకాశాలు లేకుండా పోయాయి. అయితే అలాంటి ఈ హీరో ఓ స్టార్ డైరెక్టర్ని షూటింగ్ సెట్లోనే కొట్టినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇది నిజమేనని ఓ ఇంటర్వ్యూలో జీవిత, రాజశేఖర్ లు తెలియజేశారు.ఇక ఆ డైరెక్టర్ ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేందర్రావు.
Raja Sekhar who crushed the director
అంత పెద్ద డైరెక్టర్ తో రాజశేఖర్ కి ఎందుకు గొడవ..ఆ డైరెక్టర్ ని ఎందుకు కొట్టారు అని అందరూ అనుమానపడతారు. అయితే అసలు విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్, జీవిత చెబుతూ.. మా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని చూసుకోవడానికి నా భార్య జీవిత నా మరదల్ని అలాగే మా అత్తయ్యని ఇంటికి తీసుకువచ్చింది. ఇక ఓ రోజు మా మరదలు షూటింగ్ సెట్ కి వచ్చిన సమయంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆమె బాగుందని సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నారట. అయితే ఈ విషయాన్ని రాఘవేంద్రరావు అంటే ఇష్టం ఉన్న ఓ హీరోయిన్ నా దగ్గరికి వచ్చి వేరే విధంగా ఎక్కించి చెప్పింది.(Raja Sekhar)
Also Read: Lavanya: నా భర్తతో ఆ హీరోయిన్ ఎందుకుంది.. రాజ్ తరుణ్ ఇష్యుపై రచ్చ చేసిన లావణ్య..?
మీ మరదల్ని ఆయన సినిమాల్లోకి తీసుకువచ్చి వాడుకోవాలని చూస్తున్నారు.చీట్ చేయాలని చూస్తున్నారని చెప్పింది.దాంతో అది నిజమేనని నమ్మిన నేను ఫుల్ గా మందు తాగాక కోపంలో రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి గట్టిగా అడిగేసరికి అక్కడ ఉన్నవాళ్లు దాన్ని మరింత రచ్చ చేశారు. ఇక మీడియాలో మేమిద్దరం కొట్టుకున్నామని, నేను రాఘవేంద్రరావు మీద చేయి చేసుకున్నానని రాసారు.అయితే గొడవ పెట్టుకుంది నిజమే కానీ కొట్టుకునేంత కాదు. ఇక తర్వాత అసలు విషయం తెలిసి చాలా బాధపడ్డాను. తప్పంతా నాదేనని కుమిలిపోయాను.
ఇక హీరోయిన్ కావాలనే రాఘవేంద్ర రావుని మాకు దూరం చేయాలనే ఉద్దేశంతో అలా చెప్పింది అని గ్రహించాను. ఇక ఈ విషయంలో చిరంజీవి,శ్యాం కుమార్ రెడ్డిలు కల్పించుకొని వారితో మాట్లాడేలా చేస్తామని చెప్పారు.కానీ వారెవరు మాకు సహాయం చేయలేదు. ఆ తర్వాత మేమే ఆయన దగ్గరికి స్వయంగా వెళ్లి క్షమించమని అడిగాం.కానీ రాఘవేంద్రరావుకి ఆ విషయం ఇప్పటికి మనసులోనే ఉంది. ఆయన మమ్మల్ని పూర్తిగా క్షమించలేదు అంటూ రాజశేఖర్, జీవితలు చెప్పుకొచ్చారు. ఇక రాజశేఖర్ కి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిన అల్లరి ప్రియుడు మూవీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిందే.(Raja Sekhar)