Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ కి యాంకర్ సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఫ్రెండ్ గా.. విలన్ గా..అన్నగా.. ఇలా ఎన్నో పాత్రలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో చేశారు.అయితే వీరిద్దరూ చిన్నప్పటి నుండే స్నేహితులు కావడంతో ఇండస్ట్రీ లోకి వచ్చాక ప్రాణ మిత్రులుగా మారిపోయారు.. ఇక వీరి మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది.
Rajeev Kanakala revealed the true nature of Jr.NTR
అయితే తాజాగా ఎన్టీఆర్ గురించి రాజీవ్ కనకాల ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఇదే ఎన్టీఆర్ నిజ స్వరూపం అంటూ రాజీవ్ కనకాల మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ తో కలిసి ఆంధ్రావాలా సినిమాలో నటిస్తున్న సమయంలో షూటింగ్స్ స్పాట్ లో కొంతమంది సీనియర్లు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు.అయితే అక్కడికి ఎన్టీఆర్ ని పిలవడంతో నన్ను కూడా రావాలి అని ఎన్టీఆర్ అన్నారు.కానీ నేను మాత్రం రానని చెప్పాను.(Jr.NTR)
Also Read: Sridevi: శ్రీదేవి పెద్ద పొగరుబోతు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్..?
అయినా కూడా ఎన్టీఆర్ వినకుండా నన్ను ఆయనతో తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అక్కడికి వెళ్లాక ఓ సీనియర్ నటుడు నువ్వేంటి ఇక్కడున్నావ్ మేమంతా సీనియర్స్ నువ్వు పక్కకు వెళ్ళు అని మొహం మీదే అన్నారు.కానీ ఎన్టీఆర్ మాత్రం ఏంటన్న సీనియారిటీ అంటున్నారు. వాడు ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉన్నాడు. వాడి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో కూడా మీకు తెలుసు..అలాంటిది వాడిని ఎందుకు అవమానిస్తున్నారు..
అయినా వాడు రానంటే నేనే వాడిని బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. దాంతో సారీ బాబు ఇంకోసారి అలా అనను అంటూ ఆ సీనియర్ నటుడు సైలెంట్ అయిపోయారు. అయితే ఆ నటుడు పేరు ఇప్పుడు నేను చెప్పాలి అనుకోవడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆరోజు సపోర్ట్ గా మాట్లాడడం ఎంతో బాగా నచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్ నన్ను మాత్రమే కాదు ఆయనతో నటించే ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ ని తనతో సమానంగానే చూస్తాడు. అందుకే ఎన్టీఆర్ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు అంటూ రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(Jr.NTR)