Rajendra Prasad and Actress Rajani Relation

Rajendra Prasad: తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ అంటే గుర్తుకు వచ్చే పేరు రాజేంద్ర ప్రసాద్. తనదైన నటన, టైమింగ్, కామెడీ పట్ల ఉన్న అనుభవంతో ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయనను, అభిమానులు ‘నటకిరీటి’ అని పిలుస్తారు. బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల మధ్య కూడా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

Rajendra Prasad and Actress Rajani Relation

రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో ఎంచుకున్న కథలు, పాత్రల వైవిధ్యం ఆయనను కామెడీ హీరోగా నిలబెట్టాయి. ‘అహ నా పెళ్ళంట’, ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’ వంటి హాస్య చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ సినిమాలు ఆయన కెరీర్‌లో మరచిపోలేని మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన నటనకు సాటి ఎవరూ ఉండరని, ఒకే సమయంలో నవ్విస్తూ, ఆలోచింపజేసే సినిమాలు చేసే నటుడు అని ప్రేక్షకులు అభినందించారు.

Also Read: Vineeth Family Life: అలనాటి హీరో వినీత్ భార్య ఎవరో తెలుసా?

హాస్య పాత్రల్లోనే కాకుండా, ‘ఆ నలుగురు’ వంటి సందేశాత్మక చిత్రాల్లోనూ నటించి, సామాజిక అంశాలపై తనదైన శైలిలో మాట్లాడారు. తన కేరీర్‌ను హాస్య పాత్రలకే పరిమితం చేయకుండా, విభిన్నమైన పాత్రలను కూడా స్వీకరించారు. ‘ఎర్రమందారం’ వంటి చిత్రాల్లో సీరియస్ పాత్రలు చేసి తన నటనలో ఉన్న వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చాటుకున్నారు. అయితే, పర్సనల్ లైఫ్‌లో కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నారు. ఆయన కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయిన సందర్భం ఆయన హృదయాన్ని కదిలించింది. ఆ సమయంలో ఎదురైన కష్టాలను మనసులో దాచుకుని, సినిమాల్లో తన నటనతో దైర్యంగా ముందుకెళ్లారు.

రాజేంద్ర ప్రసాద్ మరియు నటి రజని మధ్య ఉన్న అనుబంధం కూడా అప్పట్లో టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోవాలని భావించారని ప్రచారం జరిగినప్పటికీ, అనేక కారణాల వల్ల ఆ వివాహం జరగలేదు. అయినప్పటికీ, ఆమె ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ తనవంతుగా సహాయం చేసినట్లు చెప్పుకుంటారు. తన సహజత్వం, తన నిజాయితీ అతనిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. సినిమాల్లో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో మజిలీలు దాటిన రాజేంద్ర ప్రసాద్, తెలుగు చిత్రరంగానికి అందించిన కాంట్రిబ్యూషన్ అపారమైనది. నటనలో ఆయన ప్రదర్శించిన వైవిధ్యం నేటికీ చాలా మంది నటులకు స్ఫూర్తిగా నిలుస్తాయి.