Rajendra Prasad romance with that heroine

Rajendra Prasad: ఇండస్ట్రీలో హీరోగా, కమెడియన్ గా ఎవరైనా చేస్తారు. కానీ హీరోగా, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని హంగులు కలగలిగినటువంటి నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా వినిపించేది రాజేంద్రప్రసాద్ పేరే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో గుర్తింపు పొందినటువంటి రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. కడుపుబ్బా నవ్వాలి అనుకుంటే రాజేంద్రప్రసాద్ సినిమాలకు వెళ్లాలి అనుకునేవారు..

Rajendra Prasad romance with that heroine

అలాంటి రాజేంద్రప్రసాద్ సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉండగానే విజయ చాముండేశ్వరినీ వివాహ మాడారు.. వీరి వివాహం తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తయట.. ప్రధాన కారణం ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్ పై పుట్టినటువంటి కొన్ని రూమర్స్ అని తెలుస్తోంది. ఆ రూమర్స్ విన్నటువంటి తన భార్య చాలా టార్చర్ చేసిందట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం కామన్. ఆ విధంగానే రాజేంద్ర ప్రసాద్ కొత్తగా పెళ్లి చేసుకున్న క్రమంలో అనేక ఎలిగేషన్స్ వచ్చాయట. అయినా అవేవి పట్టించుకోకుండా తన కెరియర్ పై దృష్టి పెట్టి ముందుకు వెళ్లారు.(Rajendra Prasad)

Also Read: Prabhas: ఆమె స్టార్ హీరోయిన్.. తన సినిమాలో అస్సలు వద్దన్నా ప్రభాస్.. కారణం ఏంటి?

ఒకానొక క్రమంలో ఈ ఎలిగేషన్లు తట్టుకోలేక తన భార్య కూడా రాజేంద్రప్రసాద్ ని అవమానించిందట.. నిజానికి రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో.. ఈయనతో నటించడానికి ఎక్కువమంది హీరోయిన్లు ముందుకు వచ్చేవారు కాదు. దీంతో ఆయన రిపీటెడ్ హీరోయిన్లతో నటించేవారు. అలా రాజేంద్రప్రసాద్ ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్ల లిస్టులోకి రజిని, ఆమని వస్తారు. వీరిద్దరితో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల వీరితో రాజేంద్రప్రసాద్ కు ఏదో రిలేషన్ ఉందని అప్పట్లో కొన్ని పుకార్లు పుట్టాయి. ఇక ఆమనితో అయితే ఎదురింటి పెళ్ళాం పక్కింటి మొగుడు, మిస్టర్ పెళ్ళాం, పచ్చని సంసారం వంటి ఎన్నో సినిమాల్లో చేశారో రాజేంద్రప్రసాద్. అలా స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా వీరిని సెలెక్ట్ చేసేవారట.

Rajendra Prasad romance with that heroine

అంతేకాదు వీరి కెమిస్ట్రీని మెచ్చినటువంటి ఒక సంస్థ బెస్ట్ సిల్వర్ స్క్రీన్ కపుల్ గా సన్మానం కూడా చేసిందట. సన్మానం పూర్తయ్యాక ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ కి భార్య ద్వారా చేదు అనుభవం ఎదురైందట. ఆయన ఇంటికి వచ్చి రాగానే మీ బెస్ట్ ఫెయిర్ ఎలా ఉంది అని వ్యంగ్యంగా మాట్లాడేదట.. ఇక ఆమె మాటలను తట్టుకోలేక రాజేంద్రప్రసాద్ తనలో తాను ఎంతో కుమిలిపోయేవారట. కానీ తన భార్య తనను ఎక్కువగా ఎగతాళి చేస్తూ మీ బెస్ట్ ఫెయిర్ తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అని కూడా అనేదట. ఒకానొక సమయంలో నీకు విడాకులు కూడా ఇస్తానని అనేదట.. ఆమె మాటలను తట్టుకోలేక రాజేంద్రప్రసాద్ తనలో తాను కుమిలిపోయి తనకు సర్ది చెబుతూ జీవితాన్ని అలా నెట్టుకుంటూ వచ్చారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.(Rajendra Prasad)