Rajinikanth: చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా ప్రభావితమైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మంగళవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో చెన్నై జలమయమైంది. రోడ్లు నదులను తలపిస్తుండగా, సుమారు 300 ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రజనీకాంత్ నివాసం ఉన్న పోయెస్ గార్డెన్ కూడా వరద నీటిలో చిక్కుకుంది.
Rajinikanth Residence Affected by Heavy Rains in Chennai
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలలో రజనీకాంత్ ఇంటి ఆవరణ మొత్తం నీటితో నిండినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి లోపలకి కూడా నీరు చేరినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల రజనీకాంత్ ఇంటికి వరద నీరు చేరడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాగే భారీ వర్షాల వల్ల ఆయన ఇల్లు నీట మునిగింది. అయితే ఈసారి పరిస్థితి మరింత తీవ్రమై ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Pushpa 2: ట్రైలర్ ను రెడీ చేస్తున్న పుష్ప.. ఎప్పుడొస్తుందంటే?
తమిళనాడు సీఎం స్టాలిన్ తక్షణమే అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచించడంతో పాటు, పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. చెన్నైలో రెడ్ అలర్ట్ కొనసాగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇటీవలే అనారోగ్యంతో కోలుకున్న రజనీకాంత్, షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ వరదలు సమస్యలు సృష్టించాయి. ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ త్వరగా ఈ కష్టాల నుంచి బయటపడాలని, మళ్లీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నారు.