Rajinikanth: రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ప్రేక్షకులకు అదొక పండగ. అభిమానులకు అయితే ఒక జాతర అనే చెప్పాలి. స్కూల్స్ దగ్గర్నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల దాకా రజినీ సినిమా విడుదల రోజు హాలిడేని ప్రకటిస్తూ ఉంటారు. తమిళనాడులో రజనీకాంత్ కు పోటీగా సినిమాను రిలీజ్ చేయాలి అంటే ఏ హీరో కూడా సాహసం చేయడు. ముందు వారం, ఆ తర్వాత వారం వారి సినిమాలు విడుదల కాకుండా చూసుకునేవారు. అలాంటి రజనీకాంత్ ను ఢీకొట్టే ధైర్యం ఇప్పటిదాకా ఎవరు చేయలేదని చెప్పాలి.
Rajinikanth ’s Market Under Pressure: Is the Superstar’s Era Ending?
కానీ ప్రస్తుతం ఆయన మార్కెట్ బాగా వీక్ అయింది అని చెప్పాలి. దానికి కారణం ఆయన రాబోయే సినిమా అక్టోబర్ 10 వ తేదీన విడుదల అవుతున్న కూడా అదే రోజున మరొక హీరో తన సినిమాను విడుదల చేసేందుకే నిశ్చయించుకోవడం ఆయనకు మార్కెట్ తగ్గిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సూర్య ‘కంగువ’ చిత్రాన్ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించారు. ఆ తర్వాతనే రజిని ‘ వేట్టాయాన్’ రిలీజ్ డేట్ ఖరారు అయింది. తర్వాత సూర్య తన సినిమాను వాయిదా వేస్తాడేమోనని అందరూ అనుకున్నారు.
Also Read: Shradda Kapoor: స్త్రీ 2 మూవీ హీరోయిన్ ఆ పెళ్లయిన హీరోతో ప్రేమలో పడిందా.?
కానీ ‘కంగువా’ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు.. అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఇద్దరు పెద్ద హీరోలకు పోటీ తప్పదనే చెప్పాలి. వాస్తవానికి రజినీ సినిమాలు ఇదివరకలా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి.ఆయన సినిమా కాసుల వర్షం కురిపించి చాలా రోజులే అయిపోయింది. ఆయన అభిమానులను కూడా వరుస ప్లాప్ ను కలవరానికి గురి చేస్తుండగా ఇప్పుడు చేసే ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అని ప్రతి ఒక్కరిలో ఎంతో ఆసక్తి ఉంది.
ఇప్పటిదాకా దీనికి సంబంధించిన కంటెంట్ ఏది కూడా బయటకు రాలేదు. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తే కనుక తప్పకుండా రజనీకాంత్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంగువ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.