Rakul Preet Singh Suffers Injury During Gym Workout

Rakul Preet Singh: టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం ఎక్కువగా హిందీ చిత్రాలపై దృష్టి పెట్టింది. “దే దే ప్యార్ దే 2″లో అజయ్ దేవ్గన్‌తో కలిసి నటిస్తున్న రకుల్, ఊహించని విధంగా గాయపడ్డారు. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన ఆమె జిమ్‌లో రెగ్యులర్‌గా వర్కౌట్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Rakul Preet Singh Suffers Injury During Gym Workout

భారీ బరువులు ఎత్తే క్రమంలో ఆమె గాయపడ్డారు. రకుల్ 80 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో ఆమె వెన్నుపూసకు గాయమైనట్లు తెలుస్తుంది. పెద్ద బరువులు ఎత్తేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిసింది. వర్కౌట్ బెల్ట్ ధరించకుండా బరువులు ఎత్తడం వల్ల వెన్నుపూసపై అధిక ఒత్తిడి పడి గాయమైందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sharwa 38: శర్వా సినిమా కోసం 15 ఎకరాల్లో భారీ ఖర్చుతో సెట్!!

గ్యాయంతో వెంటనే వైద్యులను సంప్రదించిన రకుల్, వారు సూచించినట్లుగా కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీని కారణంగా ఆమె ప్రస్తుతం అన్ని షూటింగ్‌లను నిలిపి, పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ గాయం వల్ల “దే దే ప్యార్ దే 2” చిత్రం షూటింగ్‌లో కూడా కొంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది.

ఈ సంఘటన జరిగిన రెండు వారాల తర్వాత మాత్రమే ఈ విషయం బయటకు వచ్చింది. అభిమానులు సోషల్ మీడియాలో రకుల్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలు తెలుపుతున్నారు. రకుల్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరోగ్యంగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక కళ” అని క్యాప్షన్ ఇచ్చారు.