Rakul Preet Singh: రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మూలాలే కనిపించకూడదని ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేసినా కూడా ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఇందులో కీలకంగా ఉండడంతో పోలీసులు కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదని తెలుస్తుంది.ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉండడంతో అందులో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిదని పోలీసులు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు వేయడం లేదు. దీంతో షరా మామూలే అన్నట్లు ఎప్పటికప్పుడు డ్రగ్స్ కేసులో నిందితులు బయట పడుతూనే ఉన్నారు.
Rakul’s younger brother in the drug case.. Is Rakul Preet Singh also related
ఆ మధ్య రాజ్ తరుణ్ లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఇక గత నెలలో సినీనటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి.అయితే ఆమె బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొనడంతో అక్కడున్న వాళ్లకు కొంత మంది డ్రగ్స్ తీసుకోవడంతో హేమ కూడా డ్రగ్స్ తీసుకుందనే టాక్ వినిపించేది. కానీ ఆ తర్వాత డ్రగ్స్ టెస్ట్ చేయగా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా నిన్న సైబరాబాద్ పోలీస్ లకి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ డ్రగ్స్ తో సహా పట్టుబడ్డాడు.(Rakul Preet Singh)
Also Read: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు..కెరీర్ ఖతమే!!
ఆయన 200 గ్రాముల కి పైగాకొకైన్ తో పట్టుపడ్డాడు. ఈయనతో పాటు ఐదుగురు నైజీరియన్లు అలాగే ఇంకో ఐదుగురు వ్యాపారస్తులు, సినీ, రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రగ్స్ కేసు ఒక్కసారిగా మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి పేరు ఈ కేసులో మెయిన్ గా వినిపించడంతో రకుల్ కి కూడా డ్రగ్స్ తో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కేసులో ఆమెను విచారించిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్ళీ దీనికి సంబంధించిన వివరాలు ఏవీ కూడా బయట పెట్టలేదు. అయితే ఇప్పుడు రకుల్ తమ్ముడు డ్రగ్స్ కేసులో దొరకడంతో రకుల్ పేరు మరోసారి మీడియాలో వైరల్ అవుతుంది.(Rakul Preet Singh)