Ram Charan bought a diamond ring for that girl for 2 crores

Ram Charan: తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఒక స్టార్ హోదాను సంపాదించుకుంది. ఇంతటి హోదా రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరే కాకుండా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు మంచి ఫామ్ లోనే ఉన్నారు.

Ram Charan bought a diamond ring for that girl for 2 crores

అలాంటి ఈ తరుణంలో వీరికి సంబంధించిన ఎలాంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అలాంటిది గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గురించి వార్తలు వస్తే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా రామ్ చరణ్ ఒక హీరోయిన్ కు రెండు కోట్ల ఖరీదు చేసే రింగు కొనిచ్చారని ఒక వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీంతో ఉపాసన కాస్త సీరియస్ కూడా అయిందట.. మరి రామ్ చరణ్ ఎవరికీ రింగ్ కొనిచ్చారు. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా.. (Ram Charan)

Also Read: Ram Charan: కీర్తి సురేష్ తీరని కోరిక తీరుస్తున్న రామ్ చరణ్.. ఎన్నో ఏళ్లుగా!!

మెగా హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటినుంచి ఆయనకు ఇండియా మొత్తంలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు.. ఈ సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తోందట..ఈ విధంగా సినిమాలో బిజీగున్నటువంటి రామ్ చరణ్ తన బాబాయ్ నాగబాబు కూతురు అయినటువంటి నిహారికకు రెండు కోట్ల ఖరీదు చేసే రింగును కొనిచ్చారట..

Ram Charan bought a diamond ring for that girl for 2 crores

అయితే రక్షాబంధన్ సందర్భంగా నిహారిక రామ్ చరణ్ కు రాఖీ కట్టిందట. సాంప్రదాయం ప్రకారం సోదరికి ఎవరైనా గిఫ్టులు ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే రామ్ చరణ్ నిహారికకు ఎంతో ఇష్టమైన డైమండ్ రింగ్ కొనిచ్చారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం నిహారికా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా గడుపుతోంది.(Ram Charan)