Ram Charan: ఏంటి నిజంగానే రామ్ చరణ్ అన్నయ్య సీనియర్ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇంతకీ రామ్ చరణ్ సోదరుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న ఆ హీరో ఎవరు అనే సంచలన విషయం ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ అన్నయ్య అంటే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ సినిమాలో సీనియర్ నటుడు ప్రశాంత్ రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో నటించాడు.
Ram Charan elder brother second marriage with senior heroine
అలా టాలీవుడ్ లో ప్రస్తుతం ఈయనను అందరూ రామ్ చరణ్ అన్నయ్యగా పిలుస్తున్నారు.అయితే అలాంటి ప్రశాంత్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.ముఖ్యంగా ఈయన నటించిన జీన్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో అప్పటినుండి జీన్స్ హీరోగా ప్రశాంత్ పేరు తెచ్చుకున్నారు. ఇక అలాంటి ప్రశాంత్ గృహలక్ష్మిని ప్రేమించి పెళ్లాడినప్పటికీ వీరి కాపురం ఎక్కువ రోజులు నిలవలేదు. (Ram Charan)
Also Read: Pawan Kalyan: పవన్ కి ఆ హీరోయిన్ తో మూడో పెళ్లి.. కానీ ఆ డైరెక్టరే విడగొట్టాడా.?
ఎందుకంటే గృహలక్ష్మికి అప్పటికే పెళ్లయిపోయింది.అయితే ఈ విషయం తెలియక పోవడంతో ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకున్నారు.ఇక వీరికి పెళ్లి ఓ బాబు పుట్టాక గృహలక్ష్మి మొదటి భర్త వచ్చి రచ్చ చేయడంతో ప్రశాంత్ గృహలక్ష్మికి విడాకులు ఇచ్చేశారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈయన సింగిల్గానే ఉంటూ వస్తున్నారు.
అయితే రీసెంట్ గా ప్రశాంత్ తండ్రి ఓ ఈవెంట్లో తన కొడుకు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అని, త్వరలోనే గుడ్ న్యూస్ చెబుదామని చెప్పారు.అయితే తాజాగా కోలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రశాంత్ ఇండస్ట్రీలో ఉన్న ఓ సీనియర్ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారట. గత కొద్ది రోజులుగా ఆ హీరోయిన్ తో ప్రశాంత్ ప్రేమలో ఉన్నారని సమాచారం. మరి ఇంతకీ ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోబోయే ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది.(Ram Charan)