KTR: రాజకీయాలు మారినా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గులాబీ పార్టీ జోకడం మొదలుపెడుతోంది. గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీ అలాగే టిడిపి పార్టీల మధ్య వైరం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ వైరం మరింత పెరిగింది. ముఖ్యంగా కెసిఆర్ 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా… ఉన్నన్ని రోజులు… తెలుగుదేశం పార్టీని కతం చేశారు. KTR

Rama Rao playing Babu in Confuzen

తెలంగాణలో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు అందరిని గులాబీ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. దాంతో తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా మిగలలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళ్లడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

Also Read : Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మోడీ ప్రభుత్వం బిగ్ షాక్?

అయితే తాజాగా… గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… చంద్రబాబు నాయుడు ను పొగుడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో… 16 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు ఇచ్చారని… దానిని చంద్రబాబు సక్రమంగా వాడుకున్నారని కొనియాడారు. Nda కు చంద్రబాబు అవసరం ఉందనేపద్యంలో… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను…. టిడిపి అడ్డుకుంది అంటూ కేటీఆర్ తెలిపారు.

అచ్చం అలాగే తెలంగాణలో గులాబీ పార్టీకి…. దాదాపు పది ఎంపి స్థానాలు వచ్చి ఉంటే బొగ్గు గనులను వేలం వెయ్యకుండా ఆపే వాళ్ళమని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు, బిజెపి 8 సీట్లు గెలుచుకొని… తెలంగాణ గనులను వేలం వేస్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. ఈ సందర్భంలోనే చంద్రబాబును పొగుడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.