Ramya Krishnan: స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కూడా సినిమాల్లో రాణిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన రమ్యకృష్ణ ఓ డైరెక్టర్ చేసిన పనికి కన్నీళ్ళతో ఇంటికి వెళ్లిందట. మరి ఇంతకీ ఆయన ఎవరూ.. 10,000 చేతిలో పెట్టి ఏం చేయమని చెప్పాడు అనేది ఇప్పుడు చూద్దాం..
Ramya Krishnan who shed tears asking him to do the work for ten thousand
రమ్యకృష్ణకు 10,000 చేతిలో పెట్టగానే కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఏదో అడగకూడని పని అడిగితే కాదు. ఆ డైరెక్టర్ చేసిన మంచి పనికి..ఇక అసలు విషయం ఏమిటంటే.. రమ్యకృష్ణ,శ్రీకాంత్ కాంబోలో వచ్చిన ఆహ్వానం మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో డబ్బు పిచ్చి పట్టిన భర్తకి ఓ భార్య ఎలా బుద్ధి చెబుతుంది అనే స్టోరీని అద్భుతంగా చూపెట్టారు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి.(Ramya Krishnan)
Also Read: Prabhas: సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదు.. ప్రభాస్ మూవీ లో మెగాస్టార్..?
అయితే ఈ సినిమా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.ఇక ఈ సినిమా క్లైమాక్స్ షూట్ అయిపోయాక షూటింగ్ చివరి రోజు రమ్యకృష్ణ షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయే సమయంలో ఎస్వి కృష్ణారెడ్డి రమ్యకృష్ణ ని పిలిచి చీరే సారె పెట్టారట.ఒక ఇంటి ఆడపడుచుని ఎలా అయితే ట్రీట్ చేస్తారో అచ్చం అలాగే రమ్యకృష్ణని ఆయన,
ఆయన భార్య ఇద్దరు చూడడంతో ఆయన తనపై చూపెట్టిన ఎమోషనల్ బాండింగ్ కి రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకుందట. ఓ ప్లేట్లో పట్టు చీర 10,000 రూపాయలు పెట్టి గాజులు,పూలు ఇచ్చి ఇంటికి పంపించారట రమ్యకృష్ణను.ఇక ఇంటికి వెళ్ళిన రమ్యకృష్ణ ఇంట్లో వాళ్లకి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుందట. ఇలాంటి గొప్ప మనసు ఉన్న దర్శకుడిని నేను ఎక్కడా చూడలేదు అని రమ్యకృష్ణ చెప్పిందట.(Ramya Krishnan)