Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందాన అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే తిరుగులేని హీరోయిన్ గా మారినటువంటి ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపు పొందింది.. అలాంటి ఈమె విజయ్ దేవరకొండ తో లవ్ లో ఉందని గత కొంతకాలం నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ సీక్రెట్ గా పలు వేకేశన్స్ వెళ్తుంటారని కూడా తెలుస్తోంది.
Rashmika gave a warning to Badminton Kidambi Srikanth
ఇక ఇదిలా ఉండగా తాజాగా దీపావళి సందర్భంగా ఏకంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరు తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే రష్మిక క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి శ్రావ్య బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. అయితే శ్రావ్యకు ఈ మధ్యకాలంలోనే భారత స్టార్ బ్యాట్మెంటన్ కితాంబి శ్రీకాంత్ తో నిశ్చితార్థం జరిగింది.(Rashmika)
Also Read: Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే.?
త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు. ఇదే తరుణంలో శ్రావ్య బ్యాచిలర్ పార్టీ ఇవ్వడంతో రష్మిక ఆ పార్టీకి హాజరైంది.. దీనికి సంబంధించిన ఫోటోలను శ్రావ్యా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇదే నా చివరి బ్యాచిలర్ పార్టీ అని తెలియజేసింది. దీంతో రష్మిక మందన కామెంట్స్ పెడుతూ శ్రావ్యను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇకపై తాను నీదే అంటూ చెప్పిందట..
దీనికి శ్రీకాంత్ బదులిస్తూ నేను ఆమెను మహారాణిలా చూసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రష్మిక పుష్ప2 కుబేర, ద గర్ల్ ఫ్రెండ్, థమా వంటి చిత్రాల్లో నటిస్తోంది.(Rashmika)