Rashmika: టాప్ బిజినెస్ మాన్ అయినటువంటి అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలందరూ ఆయన ఇంటి దగ్గరే ఉంటారు.ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఎంతో మంది బాలీవుడ్ జనాలు పెళ్లి వేడుకలకు వచ్చారు.ఇక పెళ్లికి మాత్రం అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన జ్యువెలరీ,కట్టుకున్న చీరలు,లెహంగాలు, డ్రెస్సులు ఇలా ప్రతి ఒక్కదాని గురించి నెట్టింట్లో వైరల్ గా మారింది.
Rashmika wore an expensive lehenga in Ambani’s wedding
అయితే తాజాగా అంబానీ పెళ్లికి వెళ్లిన రష్మిక మందన్నా కి సంబంధించిన ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. రష్మిక మందన్నా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్ళికి ఎల్లో కలర్ లెహంగాలో వెళ్ళింది. అయితే రష్మిక మందన్నా వేసుకున్న ఆ యెల్లో కలర్ లెహంగా ధర ఎంతో తెలుసా అని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ రష్మిక మందన్నా వేసుకున్న ఆ ఎల్లో లెహంగా ధర ఎంతై ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.. (Rashmika )
Also Read: Nita Ambani: నీతా అంబానీ పట్టుకున్న దీపం వెనుక రహస్య మిస్టరీ.. ఏంటంటే.?
ఛలో మూవీ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక గత ఏడాది వచ్చినా అనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టి రష్మిక మందన్నా కి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. వరస సినిమాలతో జోరు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అంబానీ పెళ్లిలో సందడి చేసింది.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్ళికి ఈ హీరోయిన్ సాంప్రదాయబద్ధంగా ఉండే లెహంగాని ధరించి వెళ్ళింది. ఇక ఆ లెహంగా ధర ఏకంగా 1,25,000 అని తెలుస్తోంది.
భారీ వర్క్ తో ఉన్న లెహంగాని ధరించిన రష్మిక మందన్నా రెండు దుపట్టాలను వేసుకొని చాలా గ్రాండ్ లుక్ లో కనిపించింది. అంతే కాదు లెహంగాకి తగ్గట్లు హెయిర్ స్టైల్ తో పాటు జువెల్లరీ కూడా ధరించి పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో గ్రాండ్ లుక్ లో కనిపించిన రష్మికని చాలామంది అలాగే చూస్తూ ఉండిపోయారు.ఇక రష్మిక లెహంగా కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో దాని ధర ఎంత ఉండచ్చు అని జనాలు సెర్చ్ చేయగా దాని ధర అక్షరాల 1,25,000 అని తెలియడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు.(Rashmika )