Ratan Tata Automotive Revolution with Tata Indica

Ratan Tata: రతన్ టాటా.. ఈ పేరు తెలియని వ్యక్తి భారతదేశంలో ఎవరుండరు. టాటా వ్యాపార సామ్రాజ్యం అనేక రంగాల్లో విస్తరించి ఉండి, ముఖ్యంగా కార్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 1991లో రతన్ టాటా టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, సంస్థను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లారు. ప్రజలకు అందుబాటు ధరలో కార్లు అందించాలన్న ఉద్దేశంతో, టాటా నానో, టాటా ఇండికా వంటి మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

Ratan Tata Automotive Revolution with Tata Indica

రతన్ టాటాకు టాటా ఇండికా కారుపై ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన గతంలో స్వయంగా ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇండికా కారు పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “25 సంవత్సరాల క్రితం టాటా ఇండికాతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది వేసింది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది,” అని పేర్కొన్నారు.

Also Read: Balakrishna: సూపర్ హీరోగా బాలయ్య..అక్టోబర్ 11న అనౌన్సమెంట్!!

1998లో టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల తయారీని ఇండికా మోడల్‌తో ప్రారంభించింది. ఈ కారు ప్రారంభమైన రెండు సంవత్సరాల్లోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన నాడు ఇండికా విస్తృతంగా ఉపయోగించబడింది. అయితే, మళ్లీ విడుదలైన విస్టా, మాంజా మోడళ్లు పెద్దగా విజయవంతం కాలేకపోయాయి, దాంతో 2018లో ఇండికా తయారీ నిలిపివేయబడింది.

టాటా మోటార్స్ ఎల్లప్పుడూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అందరికీ సరసమైన ధరల్లో కార్లు అందించడమే కాకుండా, టాటా నెక్సాన్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో మొదటి 5/5 రేటింగ్ పొందిన కారుగా నిలిచింది.