Ratan Tata: రతన్ టాటా అనే పేరు తెలియని భారతీయులుండరంటే అది అతిశయోక్తి కాదు. టాటా సన్స్ సంస్థను దేశంలోనే అగ్రగామి స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. అయితే, చిన్ననాటి కలలు మాత్రం వ్యాపార రంగంలో కాదు, ఆర్కిటెక్ట్‌గా కొనసాగడమే.
Ratan Tata Left Architecture for Business Success
రతన్ టాటా చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్చర్ మీద మక్కువతో ఉన్నారు. తండ్రి కోరిక మేరకు ఇంజినీరింగ్‌లో చేరినప్పటికీ, మధ్యలోనే ఆ కోర్సును వదిలి న్యూయార్క్‌లోని కొర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. పట్టా పొందిన తర్వాత లాస్ ఏంజిల్స్‌లో ఆర్కిటెక్ట్‌గా కొంతకాలం పనిచేశారు. అయితే అనుకోకుండా వ్యాపార బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది.
Also Read: Ratan Tata: ఆ కారుతో రతన్ టాటా కి ప్రేత్యేక అనుబంధం.. అంత స్పెషల్ ఏమిటో?
తండ్రి ఆశయాన్ని నిలబెట్టడానికి రతన్ టాటా తనకిష్టమైన ఆర్కిటెక్ వృత్తిని వదిలివేయాల్సి వచ్చింది. వ్యాపార రంగంలో అద్భుతాలు సాధించినా, తనకు ఇష్టమైన రంగాన్ని వదిలేయాల్సి రావడం బాధకలిగించిందని రతన్ టాటా గతంలో ఒక సందర్భంలో పేర్కొన్నారు. “ఆర్కిటెక్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది లేదుగానీ, ఆ వృత్తిలో కొనసాగకపోవడం మాత్రం ఎప్పుడూ బాధగా ఉంటుంది” అని అన్నారు.
ఆర్కిటెక్చర్‌లో కొనసాగకపోయినా, ఆ కోర్సులో నేర్చుకున్నవి తన వ్యాపార నిర్వహణకు ఎంతగానో తోడ్పడ్డాయని రతన్ టాటా గుర్తుచేశారు. “ప్రాజెక్ట్‌లను బడ్జెట్‌లో పూర్తి చేయడం, సమస్యలను పరిష్కరించడం వంటి అనేక విషయాలు ఆర్కిటెక్చర్‌లో నేర్చుకున్నాను” అని ఆయన అన్నారు.