IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్…అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి మార్చిలో ఈ టోర్నమెంట్ ప్రారంభం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2024 డిసెంబర్ మాసంలోనే… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం జరగనుంది. IPL 2025
Ravichandran Ashwin criticizes the IPL 2025 Right to Match rule
ఈ మెగా వేలంలో చాలామంది ప్లేయర్లు జట్లు మారే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇలాంటి కీలక ప్లేయర్లు కూడా జట్లు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అయితే… ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ లో ఉన్న ఆర్టీఎం రూల్ను తీవ్రంగా వ్యతిరేకించారు ఆల్రౌండర్ అశ్విన్. ఈ రూల్ వల్ల ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. IPL 2025
Also Read: Telangana Bjp: చంద్రబాబును బతిమిలాడుకుంటున్న తెలంగాణ బీజేపీ నేతలు ?
ఆర్టీఎం రూల్ అప్లై చేస్తే…ప్లేయర్లకు అన్యాయం జరగడమే కాకుండా… వారి ఆత్మ ధైర్యం కూడా దెబ్బతింటుందని అశ్విన్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు అశ్విన్. అశ్విన్ చెప్పిన వివరాల ప్రకారం… చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్స్ అనే ఆటగాడు ఉన్నాడు. ఆ ఎక్స్ ప్లేయర్ విలువ ఏడు కోట్లు. అయితే ఆర్టీఎం రూల్ ప్రకారం… అతని చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి విడుదల చేస్తుంది. అప్పుడు అతని ప్రైజ్ రెండు కోట్లు మాత్రమే అవుతుంది. IPL 2025
రెండు కోట్ల నుంచి వేలంపాట ప్రారంభమై… ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆర్టీఎం రూల్ అప్లై చేసి… ఇతర జట్లు కొనకుండా మళ్ళీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని పాత రేటుకు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లాభం తప్ప ఆ ప్లేయర్ కు అస్సలు లాభం ఉండదు. అతనికి ఆ జట్టు పైన ఇంట్రెస్ట్ కూడా పోతుందని అశ్విని అభిప్రాయపడ్డారు. ఈ రూల్ తీసివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అశ్విన్. IPL 2025