Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతాలు సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ఆఫ్ స్పిన్నర్ గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఫీట్ సాధించడం జరిగింది. Ravichandran Ashwin
Ravichandran Ashwin leaves Gautam Gambhir awestruck with masterful cut shot
మొత్తంగా చూసుకుంటే రవీంద్ర జడేజా తర్వాత ఈ ఘనతను అందుకున్న రెండో క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ సంవత్సరం ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో జడేజా 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. తాజాగా ఈ జాబితాలోకి అశ్విన్ చేరాడు. Ravichandran Ashwin
Also Read: ICC Prize Money: ICC చరిత్రాత్మక నిర్ణయం, భారీ ప్రైజ్ మనీ ప్రకటన !
డబ్ల్యూటీసి అరంగేట్ర సీజన్ నుంచి ఆడుతున్న అశ్విన్ 1000 ప్లస్ రన్స్ తో పాటు 174 వికెట్లు తీయడం విశేషం. మరోవైపు 1600 ప్లస్ పరుగులతో పాటు 102 వికెట్లు తీశాడు రవీంద్ర జడేజా. ఇప్పటివరకు 101 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రవీంద్రన్ అశ్విన్….500 ప్లస్ వికెట్లతో పాటు ఆరు శతకాలు 14 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. అయితే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చూసి.. గంభీర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. Ravichandran Ashwin