Raviteja new movie for sankranthi

RaviTeja: రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆగస్టు 15 న విడుదల కావడానికి సిద్ధమవుతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తూ ఉన్న ఈ చిత్రం యొక్క షూటింగ్ అతి తక్కువ కాలంలోనే పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ విధంగా రవితేజ సినిమా సినిమాకు ఎక్కువగా గ్యాప్ తీసుకోడు కాబట్టి తన చిత్రాలను వరుసగా విడుదల చేయడం ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.

Raviteja new movie for sankranthi

అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తయ్యాయో లేదో వెంటనే తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులలో నిమగ్నమైపోయాడు. రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ వారితో చేయబోతున్న సినిమా కోసం ఇప్పుడు రెడీ అవుతున్నారు. ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రచయిత బాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే భాను దర్శకుడుగా పరిచయం కాబోతూ ఉండగా రవితేజ కోసం ఒక మంచి కథ రాయడం దాన్ని రవితేజ ఓకే చేయడం చక చక పూర్తయిపోయాయట.

Also Read: Meenakshi Chaudhary: సినిమాలు చేయాలంటేనే భయంగా ఉందంటున్న బిజీ బ్యూటీ!!

ఫైనల్ గా ఈ సినిమా యొక్క షూటింగ్ కొంతమేరకు జరగగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కోసం ఆయన కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా యొక్క పనులు పూర్తి కావడంతో ఈ సినిమాను తొందరలోనే మొదలు పెట్టనున్నాడు రవితేజ. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో పోటీ నెలకొంటుంది అని చెప్పాలి.

శ్రీ లీల కథనాయకగా నటిస్తూ ఉండగా భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా తో రవితేజ ధమాకా కాంబినేషన్ ను రిపీట్ చేయనున్నాడు. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రవితేజ కూడా వీరితో జాయిన్ అవ్వడం మరింత ఆసక్తికరంగా ఉంది. ఇంకోవైపు కోలీవుడ్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు సినిమా కూడా సంక్రాంతికి రాబోతుంది. నాగచైతన్య తండేల్ కూడా ఈ పండుగ నే టార్గెట్ చేయగా వీరిలో ఎవరి సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.