Rcb: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మెగా వేలం ఈ నెల చివర్లో జరగనున్న నేపథ్యంలో… ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రయాణం బెంగళూరు తో ఇంకా ముగి లేదని… ఇంకా ఉందంటూ పేర్కొన్నాడు మాక్సి మామ. మెగా వేలంలో మళ్లీ… తనను ఆర్సీబీ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉందని ఆయన వివరించాడు. Rcb

RCB Called And Ended Glenn Maxwell Explains Why He Was Released

ఈ విషయంలో పెద్దగా టెన్షన్ లేదని కూడా తెలిపాడు. రాయల్ చాలెంజర్స్ జట్టు యాజమాన్యం చాలా మంచిదని.. ఆ జట్టులో చాలావరకు స్వేచ్ఛ ఉంటుందని కూడా గుర్తు చేశాడు. వాస్తవంగా మొన్న జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో… మ్యాక్సీ మామను తీసుకోలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అటు కామరూన్ గ్రీన్ తో పాటు మహమ్మద్ సిరాజును కూడా వదిలేసింది. రజత్ పటిదార్, యష్ దయాల్ అలాగే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లను మాత్రమే.. రిటైన్ చేసుకుంది బెంగళూరు జట్టు. Rcb

Also Read: Teenmar Mallanna: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూలనున్న రేవంత్ ప్రభుత్వం?

అయితే మ్యాక్స్ వెల్ ఆట తీరు గత సీజన్లో దారుణంగా తయారయింది. ఒక్క మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు మ్యాక్సీ మామ. ఈ తరుణంలోనే.. అతన్ని మళ్లీ రిటైన్ చేసుకోలేదు. అయితే తాజాగా వేలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ్యాక్సీ మామ. రిటెన్షన్ ప్రక్రియ కంటే ముందే తనకు ఆర్సిబి యాజమాన్యం ఫోన్ చేసిందని గుర్తు చేశాడు. రిటైన్ చేసుకోలేదని బాధపడకూడదని యాజమాన్యం తెలిపింది అన్నారు. అదే సమయంలో ఆర్సిబి తో తన బంధం తెగిపోలేదని వివరించాడు. Rcb