IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆటగాళ్లను రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా రెడీ అయింది. నేటితో ఈ లిస్టు బయటకు రాబోతోంది. ఐపీఎల్ 2025 లో అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్టులో మొత్తం ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అవకాశం ఉంది. వీరిలో కేవలం ఐదుగురు భారతీయులు, ఒక విదేశీ ప్లేయర్ ఉండాలి. ఇద్దరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లను కూడా చేర్చుకోవచ్చు. IPL 2025

RCB Retention List 2025 Virat Kohli retained at 21 crore

ఐపీఎల్ లో పాల్గొనే మొత్తం 10 జట్లు తమ తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేయడం జరిగింది. వీటిని బీసీసీఐ మీడియాకు అప్పగించింది. ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేసిన ఆటగాళ్ల ప్రకటనకు చివరి తేదీ అక్టోబర్ 31న ఉంచడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. ఈ సీజన్లో రిటైన్ అయిన అత్యంత ఖరీదైన ఆటగాడి రికార్డులు బద్దలు కావడం కచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మొదట రిటైన్ చేసిన ఆటగాడికి రూ. 18 కోట్లు ఇవ్వగా ….గత సీజన్ వరకు రూ. 17 కోట్లు అందుకున్నాడు. అయితే ఫస్ట్ రిటెన్షన్ కు రూ. 18 కోట్లు ఫిక్స్ చేశారు. అయితే హెన్రిచ్ ను అట్టి పెట్టుకోవడానికి సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 23 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఈ సీజన్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇతడు ఉన్నాడు. IPL 2025

Also Read: TTD: టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులు విరాట్ కోహ్లీకి, కేఎల్ రాహుల్ పేరిట ఉన్నాయి. బెంగళూరు 2018లోవిరాట్ కోహ్లీని, లక్నో 2023లో కేఎల్ రాహుల్ ను రూ. 17 కోట్లకు రిటైన్ చేసుకున్నాయి. ఈ సీజన్లో విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతను కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఎల్ఎస్జితో బంధాన్ని తెంచుకున్నాడని మెగా వేలానికి వెళ్ళనున్నాడని వార్తలు వచ్చాయి. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. IPL 2025