IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించడం ప్రారంభమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. దీంతో కోహ్లీ తిరిగి ఆర్సీబీకి కెప్టెన్ అవుతాడనే ఊహాగానాలు ఆర్‌ఎంసీ చుట్టు తిరుగుతున్నాయి. అయితే, ఆర్సీబీ ఈ వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి కెప్టెన్ ఎవరో ఇంకా నిర్ణయించలేదని, ఈ సీజన్ కోసం ఇతర భారత స్టార్ ఆటగాడిని కెప్టెన్సీకి టార్గెట్ చేస్తున్నామని వెల్లడించింది.
RCB Targets KL Rahul for Captaincy in IPL 2025
అంతకుముందు, కోహ్లీ ఐపీఎల్‌లో ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీ మరియు రోహిత్ శర్మ తర్వాత, కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన మూడవ ఆటగాడిగా గుర్తింపొందాడు. ఆయన నాయకత్వంలో ఆర్సీబీ 66 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 2016 ఐపీఎల్ ఫైనల్‌లో చేరినా, ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేత పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో, కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలా అనే చర్చ జోరందుకుంది.
Also Read: Ration Cardholders: రేషన్ కార్డుదారులకు తెలంగాణ సీఎం బంపర్ ఆఫర్..పేద ప్రజలకు గొప్ప మేలు!!
ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్, కోహ్లీ గురించి వస్తున్న వార్తలను ఖండిస్తూ, ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, వీలైనంత త్వరగా కెప్టెన్ కోసం సరైన ఆటగాడిని చూడాలని చెప్పారు. పత్రికా సమాచారం ప్రకారం, ఆర్సీబీ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు తీవ్రంగా ఆలోచిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ రాహుల్‌ను విడుదల చేయడంతో, ఆర్సీబీ అతనిని కొనుగోలు చేయాలని చూస్తోంది.
కేఎల్ రాహుల్, ప్రఖ్యాత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ మాత్రమే కాకుండా, మంచి కెప్టెన్ కూడా. ఆయన ఆర్సీబీకి కెప్టెన్‌గా సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారు. అయితే, రాహుల్ స్థానంలో లక్నో, ఇషాన్ కిషన్‌ను తీసుకునేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ వద్ద RTM కార్డు ఉండడంతో, వారు కిషన్‌ను తిరిగి తీసుకునే అవకాశమూ ఉంది. ఈ పరిస్థితుల్లో, ఆర్సీబీ కెప్టెన్ పదవిపై ఆసక్తి పెరిగిపోతోంది.