Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత… తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా తయారయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో గులాబీ పార్టీ ఓడిపోవడంతో…ఈ పరిస్థితి నెలకొంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి జీరో స్థానాలు రావడంతో… ఆ పార్టీలో కీలక నేతలందరూ జంప్ అవుతున్నారు. Revanth Reddy
Rebellion of 38 Congress MLAs against Revanth Reddy
ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆరుగురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబి పార్టీ కంటే బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి నర్సంపేట ఎమ్మెల్యే… దొంతి మాధవరెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారట. గత కొన్ని రోజులుగా గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలను…. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట దొంతి మాధవరెడ్డి. Revanth Reddy
Also Read: Jagan: జగన్ కు వెన్నుపోటు పొడుస్తున్న టాలీవుడ్ సెలబ్రీటీలు ?
వలస ఎమ్మెల్యేల నేపథ్యంలో… తనకు మంత్రి పదవి రాకుండా… వరంగల్ జిల్లాలో పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొన్న గులాబీ పార్టీ నుంచి వచ్చిన కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు దొంతి మాధవరెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగానే… శనివారం రోజు వరంగల్ పర్యటనకు రేవంత్ రెడ్డి వస్తే ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు దొంతి మాధవరెడ్డి. Revanth Reddy
ఇక ఇదే నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలను గెలవగా అందులో 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ రెడ్డి మాట వింటున్నారని… మిగతా 38 మంది తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా… ఆ 38 మంది తిరుగుబాటు చేస్తారన్నారు. అందుకే గులాబీ నేతలను ఇబ్బంది పెట్టి… రేవంత్ రెడ్డి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. దీంతో ఇప్పుడు ఈ టాపిక్… తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తోంది. Revanth Reddy