Balakrishna: ఇటీవలే బాలకృష్ణ చేసిన సినిమాలు ఏ స్థాయి లో హిట్ అవుతున్నాయో తెలిసిందే. ఇప్పుడు అయన తదుపరి సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. 2024లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదు.. నవ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 2025 సంక్రాంతికి లాక్ చేయబడింది. ఈ సినిమా ను కూడా సితార సంస్థ తెరకెక్కిస్తుండగా ఇప్పుడు మారిన పరిస్థితుల మధ్య NBK 109 కి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Release Problems for Balakrishna NBK 109

డిసెంబర్ 6న పుష్ప 2 విడుదలవుతుంది కాబట్టి 20న (రెండు వారాల గ్యాప్ తర్వాత) బాలయ్య విడుదల చేసినా ఇబ్బంది ఉండదు. కానీ అదే సమయంలో వేరే హీరోల సినిమాలు రాబోతున్నాయి. నితిన్ హీరో గా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా వేరే హీరోల సినిమాలు కూడా డిసెంబర్ లో రావడానికి ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య లాంటి పెద్ద స్టార్ హీరోని డైరెక్ట్ గా ఎదుర్కోవడం వారికి చాలా రిస్క్ తో కూడుకున్నదే.

Also Read: Tollywood: మారిన సినిమా రిలీజ్ లు.. ఈ సంవత్సరం రాబోయే బడా సినిమాలివే!!

మరి చివరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇక పోతే ఈ సినిమా ను డిసెంబర్‌ కల్లా రెడీ చేయాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కీలక భాగం పూర్తయింది. ఎన్నికలు, ఫలితాలు, ప్రమాణస్వీకారాల కారణంగా బాలయ్య కోసం కొంత గ్యాప్ వచ్చింది. 21 మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే డిసెంబర్ ఆఖరులో అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగా హిందూపురం ఎమ్మెల్యే అయిన ఆయన కచ్చితంగా అధికార పార్టీ తరపున హాజరుకావాల్సి ఉంటుంది. అప్పుడు అయన డేట్స్ ఉండవు కాబట్టి డైరెక్టర్ ఆ విధంగా ప్లాన్ చేశాడట.