Renu Desai: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ తన నిజాయితీ, స్పష్టమైన వ్యక్తిత్వంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగానే జరుగుతుండటం ఆమెను బాధపెట్టింది. కొంతమంది అభిమానులు “మీరు తప్పు చేశారు” లేదా “పవన్ కళ్యాణ్‌ను అర్థం చేసుకోలేకపోయారు” అనే విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే, రేణు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొని, తనదైన శైలిలో సమాధానమిస్తుంటారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరు విమర్శలు చేయకూడదని, తన పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
Renu Desai Strong Words Ignite Social Media
జంతు ప్రేమికురాలిగా పేరున్న రేణు, జంతువులపై జరుగుతున్న హింసను చూసి తీవ్రంగా స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో, కుక్కపిల్లను ఒక వ్యక్తి క్రూరంగా కొడుతుంటే, ఆమె దాన్ని చూసి తట్టుకోలేకపోయారు. “ఆ వ్యక్తి చిరునామా తెలిస్తే, నేను బుద్ధి చెబుతాను” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువులపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: BRS MLA: మరోసారి ఫిరాయింపుల పర్వం.. బీఆర్ఎస్ అస్తిత్వం కూడా మిగల్చరా?
దసరా నవరాత్రుల్లో జంతు బలుల పేరుతో జరుగుతున్న హింసపై కూడా రేణు దేశాయ్ మండిపడ్డారు. “ఏ దేవుడూ, ఏ తల్లీ జంతు బలిని కోరుకోరు” అని, “మూగ జీవులను బలి ఇవ్వడం పాపం” అని ఆమె అన్నారు. దేవుడికి బలి ఇవ్వడం అంటే ప్రేమను అర్పించడం, హింసను కాదు” అని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవాలని, లేకపోతే వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటూ, రేణు దేశాయ్ వీలైనప్పుడల్లా స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తూ ఉంటారు. “జంతువులను చంపేవారికి నరకంలో కూడా స్థానం ఉండదు” అని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువుల హక్కుల కోసం ఆమె నిలబడటంతో పాటు, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.