Nagarjuna: రేవంత్ రెడ్డి నిజంగానే నాగర్జున పై పగ పట్టినట్టు అర్థమవుతుంది అంటున్నారు గత కొద్ది రోజుల పరిణామాలు చూసిన జనాలు.. అయితే రీసెంట్ గా నాగార్జున వేసిన పరువు నష్టం దావా గురించి నాంపల్లి కోర్టులో నాగార్జున కోడలు సుప్రియ మాటలు రికార్డింగ్ చేసుకున్నారు న్యాయవాదులు. అయితే కోర్టులో పని అంతా అయిపోయాక కోర్టు బయటికి వచ్చిన కొండా సురేఖ న్యాయవాది నాగార్జునపై ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఎన్నో షాకింగ్ కామెంట్లు చేశారు.
Revanth is hurting Nagarjuna business Will Bigg Boss remove him
అసలు నాగార్జున వేసిన పిటిషన్ చెల్లదు అని, ఆయన పిటిషన్ లో ఒక మాట చెప్పారు ఆ తర్వాత మరొక మాట చెప్పారు.. ఆయన వేసిన కేసు చెల్లదు కొండా సురేఖనే గెలుస్తుంది అని బాంబు పేల్చారు. అంతేకాదు నాగార్జున వ్యాపారం కోసం ఎలాంటి పనైనా చేస్తారు. బిగ్ బాస్ వంటి దరిద్రమైన షోని మన ముందుకు తీసుకొచ్చి ఎలాంటి దరిద్రమైన పనులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. (Nagarjuna)
Also Read: Samantha: కొండా సురేఖ వివాదం తర్వాత అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన సమంత!!
బిగ్బాస్ షో లో వంద రోజులు ఒకరిపై ఒకరు పడుకుంటారు. అంత దారుణమైన షో ఇంకొకటి ఉండదు. ఇప్పటికే చాలామంది ఈ షోపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. డబ్బు కోసం నాగార్జున ఎంతవరకైనా దిగజారుతారు.. అంటూ కొండా సురేఖ న్యాయవాది సంచలన కామెంట్లు చేశారు. అయితే ఆయన మాటలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి బిగ్ బాస్ షో బ్యాన్ చేసిన చేస్తారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే రేవంత్ రెడ్డి నాగార్జున వ్యాపారం పై దెబ్బ కొట్టినట్టే అని తెలుస్తోంది.ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసి నాగార్జున ప్రాఫిట్ ని లాస్ చేశారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ కూడా బ్యాన్ చేస్తే మాత్రం నాగార్జున ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టే అంటున్నారు అక్కినేని అభిమానులు.(Nagarjuna)