Revanth Reddy: నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నీట్ వ్యవహారం పై సెట్టింగ్ జడ్జ్తో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని విమర్శలు చేశారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఈ వ్యవహారపై సిబిఐ విచారణ సరిపోదని చెప్పారు. కోట్ల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రధాని మౌనం వహించడం సరైనది కాదని ఏ ఒక్కరి పైన కేసు వేసి క్లోజ్ చేయడానికి సిబిఐకి అప్పగించారని జ్యుడిషియల్ ఎంక్వయిరీ అవసరమని ఆయన చెప్పారు.

Revanth Reddy comments on NEET

విద్యార్థులకు ఇవ్వాల్సిన భరోసా ప్రధాన నరేంద్ర మోడీ ఇవ్వట్లేదని మోడీ గ్యారెంటీ ఎక్కడ పోయిందని మోడీ గ్యారెంటీ ఖతం అయిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలానే పోచారం శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్ లోనే చివరికి ముగిసేది కాంగ్రెస్తో అని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ పిలుపుతో టిడిపిలో చేరానని పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పని చేశాను అని అన్నారు.

Also read: ‘ఎన్టీఆర్ – బాబీ డియోల్’లపై యాక్షన్ షెడ్యూల్

కాంగ్రెస్లో తిరిగి చేరడం సంతోషంగా ఉందని అన్నారు ఆరు నెలలుగా పరిపాలనను గమనిస్తున్నారని అంకితభావంతో రేవంత్ నడుపుతున్నారని.. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని చెప్పారు. రైతులకి మంచి జరగాలని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తాను కూడా కాంగ్రెస్లో చేరానని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి అన్నట్లు సిబిఐ ఎంక్వయిరీ జరుగుతుందా లేదా అనేది చూడాలి. నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన అయితే డిమాండ్ చూసారు కేంద్ర ప్రభుత్వం విఫలం అయిపోయిందని అన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి (Revanth Reddy).