Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మూసి సుందరీ కరణ… అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పొద్దున లేస్తే చాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు మూసి చుట్టే రాజకీయాలు చేస్తున్నాయి. మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న… ఇండ్లను కూల్చేసి… సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. దీని కోసం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని కూడా వెల్లడిస్తోంది. Revanth Reddy
Revanth Reddy key decision on musi
అయితే దీన్ని మూసి బాధితులు ఇటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం 25 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని కేటీఆర్ కూడా బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ 1,50,000 కోట్లతోనే చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా మారింది. దీంతో మూసి పై రోజు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. Revanth Reddy
Also Read: Jagan: ఏపీలో రానున్న సచిన్, కోహ్లీ మద్యం బ్రాండ్లు?
అయితే ఇలాంటి నేపథ్యంలోనే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. సౌత్ కొరియాకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ బృందం వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం కాంగ్రెస్ నేతలందరూ సౌత్ కొరియా వెళ్ళనున్నారని సమాచారం. దాదాపు 15 రోజులపాటు ఈ టూర్ జరగనుందట. దీనికోసం కోట్లల్లో ఖర్చు అవుతుందని వార్తలు వస్తున్నాయి. Revanth Reddy: