Revanth Reddy: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఊహించని షాక్ తగిలింది. ఆయన పదవికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు పెట్టారు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గా… ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను డిప్యూటీ సీఎం చేస్తానని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారన్ని లేపుతున్నాయి. Revanth Reddy
Revanth Reddy Shock for Bhatti Akbaruddin as Deputy CM
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు బట్టి విక్రమార్క చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా కూడా… గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిలబెట్టారు భట్టి విక్రమార్క. అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో… రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క పాత్ర కూడా ఉంది. కానీ టిడిపి నుంచి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సోనియాగాంధీ. Revanth Reddy
Also Read: Balayya: చంద్రబాబుపైన అలిగిన బాలయ్య?
దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఉద్యమకారులపై లాఠీ ఎత్తిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ఏంటని ఫైర్ అయ్యారు చాలామంది ఉద్యమకారులు. ఇక అటు బట్టి విక్రమార్క కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి… రిలాక్స్ చేసింది కాంగ్రెస్. అయితే ఇప్పుడు మట్టి విక్రమార్క డిప్యూటీ పదవికి ఎసరు పెట్టారు రేవంత్ రెడ్డి. Revanth Reddy
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ని… కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీఫామ్ పై కొడంగల్ నియోజకవర్గంలో అక్బరుద్దీన్ ను దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని ప్రకటించారు. అక్బరుద్దీన్ ను గెలిపించి డిప్యూటీ ముఖ్యమంత్రి చేస్తానని కూడా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇక దీనిపై హ్యాపీగా ఉన్నాను అంటూ అక్బరుద్దీన్ కామెంట్స్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బట్టి పదవికి త్వరలోనే ఎఫెక్ట్ రానుందని.. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కాకుండా ఇతర మార్గంలో.. బట్టి పదవికి ఎసరు పెడతారని కొంతమంది చర్చించుకుంటున్నారు. Revanth Reddy