CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చేసిన వివాదంగా మారుతోంది. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు… అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో బిల్డప్ తప్ప బిజినెస్ తక్కువగానే కనిపించింది. ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అక్కడికి వెళ్లినా కూడా తన కుట్ర రాజకీయాలను బయటపెట్టారు. CM Revanth Reddy
Revanth Reddy who went to America and brought his brother’s company
తెలంగాణ ప్రజల సొమ్ముతో… అమెరికాకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అక్కడ కంపెనీలు తీసుకురావాల్సింది పోయి… జల్సాలు చేస్తున్నారు. వాస్తవానికి ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు అమెరికాకు వెళ్లి… అక్కడి కంపెనీలను ఆహ్వానించాల్సింది. CM Revanth Reddy
Also Read: Roja: పొట్టి బట్టలు వేసుకొని పరువు తీస్తున్న రోజా ?
కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఫోటోలు పేపర్లో రావాలని ఉద్దేశంతో అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అమెరికాకు శ్రీధర్ బాబుని తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి… హైదరాబాద్కు కంపెనీలు తీసుకురావడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తాజాగా స్వచ్ బయో అనే కంపెనీని… తీసుకు వస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ కంపెనీ బండారం బయటపెట్టింది గులాబీ పార్టీ.
రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు చేస్తున్నాడని… రేవంత్ రెడ్డి తమ్ముళ్ల కంపెనీ ను తీసుకు వస్తున్నాడని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. స్వచ్ఛ బయో అనే కంపెనీ రేవంత్ రెడ్డి తమ్ముడు దేనట. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ బినామీ హర్ష పసునూరి పేరుతో… ఈ కంపెనీ పైన సంతకం పెట్టించారట. 1000 కోట్ల పెట్టుబడును తీసుకు వస్తున్నామని ఇప్పుడు డబ్బా కొడుతున్నారట రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.