Rishabh Pant: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదిక మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో.. మొదటి ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం… అదరగొడుతోంది. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభమైన తర్వాత… సరఫరాజ్ ఖాన్ అలాగే రిషబ్ పంత్.. ఇద్దరూ దుమ్ము లేపారు. Rishabh Pant
Rishabh Pant out on 99 Full list of Indians to miss Test hundreds by 1 run
సరఫరాజ్ ఖాన్.. 150 పరుగులు చేస్తే రిషబ్ పంత్ మాత్రం 99 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో రిషబ్ పంత్ సెంచరీ ఒక్క పరుగులతో పోగొట్టుకున్నాడు. అయితే రిషబ్ పంత్ ఇలా సెంచరీ మిస్ చేసుకోవడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే ఆరుసార్లు సెంచరీని మిస్ చేసుకున్నాడు రిషబ్ పంత్. సచిన్ టెండూల్కర్ తరహాలోనే 90 పరుగుల ఫోబియా రిషబ్ పంత్ కు కూడా వచ్చింది. Rishabh Pant
Also Read: Revanth Reddy: రేవంత్‌రెడ్డికి రూ.100 కోట్ల చెక్కు ఇచ్చిన అదానీ ?
సచిన్ టెండూల్కర్ కూడా 90 నుంచి 99 పరుగుల మధ్య దాదాపు పదిసార్లు అవుట్ అయ్యాడు. ఇటు రిషబ్ పంత్ ఏకంగా ఆరు సార్లు అవుట్ అయ్యాడు తాజాగా మరోసారి అవుట్ కావడంతో ఏడుసార్లు… 90 పరుగులు దాటిన తర్వాత అవుట్ కావడం జరిగింది. అయితే 99 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాట్స్మెన్లలో ఐదో వ్యక్తిగా రిషబ్ పంత్ రికార్డు లోకి ఎక్కాడు. ఇప్పటికే మహేంద్ర సింగ్, మురళి విజయ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ ఈ లిస్టులో ఉన్నారు. Rishabh Pant