Rohit Sharma Takes Responsibility for India Series Loss

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ముంబైలో జరిగిన చివరి టెస్టులో టీమిండియా మూడోసారి ఓటమిని చవిచూసింది, తద్వారా 3-0 తేడాతో క్లీన్ స్వీప్‌కు లోనైంది. ఈ ఘోర పరాజయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేయడంతో పాటు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న ఆశలపై కూడా నీరు చల్లినట్లయింది. ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే ఇప్పుడు టీమిండియాకు మరో మార్గం లేదు. కచ్చితంగా ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఉంది.

Rohit Sharma Takes Responsibility for India Series Loss

ఈ ఓటమి పట్ల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన నిరాశను వ్యక్తం చేశాడు. “సిరీస్‌లో ఇలా వైట్‌వాష్ కావడానికి కెప్టెన్‌గా నేనే బాధ్యత వహించాలి,” అంటూ రోహిత్ నిస్సహాయతతో అన్నాడు. “గెలుస్తామనుకున్న మ్యాచ్‌లు కోల్పోవడం నిజంగా బాధాకరం. మా స్థాయికి తగినట్లుగా ప్రదర్శన ఇవ్వలేకపోయాం. మేము సాధారణ ప్రమాణాలకు తక్కువగా ఆడాం, ఈ విధమైన ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.” రోహిత్ మాటల్లోని ఈ ఆవేదన జట్టు బాధ్యతను పట్ల అతనికి ఉన్న నిబద్ధతను చూపింది.

Also Read: Maheshwari: శ్రీదేవి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం కోసం కొట్టుకున్న స్టార్ డైరెక్టర్, హీరో.?

రోహిత్ తన సహచర ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా స్పందించాడు. “పంత్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు ఇలాంటి కఠిన పిచ్‌పై ఎలా ఆడాలో చూపించారు. మిగతా జట్టు సభ్యులం మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తగినంత స్థిరత్వం చూపించలేకపోయాం,” అని రోహిత్ వ్యాఖ్యానించాడు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇదే సమస్యపై చర్చించుకుంటూ వస్తున్నామని, కానీ కొంతమందిలో ఆ లోపం ఇంకా దాగి ఉన్నదని కూడా అన్నారు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తన పరిధిలోని ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయానని, జట్టును సరైన దారిలో నడిపించడంలో విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.

మొత్తం మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్‌కు లోనవడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇది భార క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించిన విషయమే కాకుండా, జట్టులో ఉన్న లోపాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కల్పించింది. ఈ సిరీస్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జట్టు మరింత బలంగా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.