Roja revealing Balakrishna true nature

Roja: బాలకృష్ణ రోజా ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే..కానీ రాజకీయాల్లోకి వచ్చే వరకు ఇద్దరూ చెరొక పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ వ్యతిరేక పార్టీలలో ఉండడం కారణంగా సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ ఉంటారు.అయితే రాజకీయాల పరంగా ఇద్దరూ ఒకరిని ఒకరు మాటలు అనుకున్నప్పటికీ పర్సనల్గా వీరిద్దరూ మంచి స్నేహితులు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.

Roja revealing Balakrishna true nature

అలా వచ్చిన సినిమాల్లో బైరవద్వీపం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా శ్రీకృష్ణ విజయం, గాండీవం,సుల్తాన్, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య వంటి దాదాపు పది సినిమాల్లో రోజా,బాలకృష్ణ కలిసి నటించారు. అయితే రాజకీయంగా శత్రువులు అయినప్పటికీ బయట మాత్రం చాలా మంచి స్నేహితులు.వీరిద్దరూ అసెంబ్లీలో కలిసినప్పుడల్లా ప్రేమగా పలకరించుకుంటారు. అయితే రీసెంట్గా బాలకృష్ణ గురించి రోజా మాట్లాడుతూ.. మేమిద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం.(Roja)

Also Read: Jr. NTR: బలుపుతో Jr.ఎన్టీఆర్ నే ఇబ్బంది పెట్టిన హీరోయిన్..?

అలా సినిమాలు చేసే సమయంలో బాలకృష్ణ చాలా అల్లరి చేసేవాడు. ఆయన అందర్నీ పిలుచుకొని చాలా ప్రేమగా పలకరించేవాడు.ఇక సమయం దొరికినప్పుడల్లా పద్యాలు, పాటలు పాడుతూ అందర్నీ అలరించేవాడు. అంతే కాకుండా బాలకృష్ణ నన్ను చూసి నీ కళ్ళు, నోరు ముక్కు చాలా బాగున్నాయి. అచ్చం రాణి లాగా ఉన్నావు.రాణి పాత్రలకి బాగా సెట్ అవుతావు అని చెప్పేవాడు.అంతే కాదు నా కలర్ ని కూడా ఎక్కువగా మెచ్చుకునేవాడు.

Roja revealing Balakrishna true nature

బయట సీరియస్ గా ఉన్నప్పటికీ షూటింగ్స్ లో మాత్రం చాలా జోవియల్ గా ఉండేవారు.పాత విషయాలు ఎన్నో గుర్తు చేసేవారు.బాలకృష్ణ లాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అసెంబ్లీలో మమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది మీరేంటి రాజకీయంగా శత్రువులు అయినప్పటికీ ఇంత బాగా మాట్లాడుకుంటారు అని షాక్ అయిపోయారు. కానీ రాజకీయాలు వేరు పర్సనల్ లైఫ్ వేరు కదా.. అంటూ రోజా బాలకృష్ణకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.(Roja)