Sai Dharam Tej Clarifies Marriage Rumors

Sai Dharam Tej: మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పర్సనల్ లైఫ్‌ కు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా, ఆయన వివాహం గురించి కొన్నివార్తలు తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ప్రేమ వ్యవహారాలు, వివాహం వంటి అంశాలు మరోసారి హైలైట్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ తన సినీ కెరీర్‌ను సాదాసీదాగా ప్రారంభించి మంచి గుర్తింపు పొందాడు. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘చిత్రలహరి’ ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్రను వేశాడు.

Sai Dharam Tej Clarifies Marriage Rumors

ప్రస్తుతం అతడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ వివాహం గురించి వస్తున్న వార్తలతో మరింతగా వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, తేజ్ ఓ హీరోయిన్ తో ప్రేమ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, ‘జవాన్’ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ మెహ్రీన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే, సాయి ధరమ్ తేజ్ తాను ఇంకా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోలేదని స్పష్టం చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాలో “హ్యాపీ సింగిల్స్ డే” అంటూ పోస్ట్ చేసిన అయన తనపై వస్తున్న వార్తలకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు అయ్యింది.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు వీళ్ళే ?

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 40 ఏళ్ల వయస్సులో ఉన్నా, ఆయన వివాహం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అభిమానులు మాత్రం అతనికి త్వరలో పెళ్లి అవుతుంది అనే ఆశను వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాయి ధరమ్ తేజ్ తన కెరీర్‌కు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తమ నిర్ణయాలను స్వేచగా తీసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు.

https://twitter.com/pakkafilmy007/status/1856599698653753501