Sai Pallavi: సాయి పల్లవి..తమిళనాడు బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి ప్రస్తుతం దేశంలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇక ఈమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. డాక్టర్ అవ్వాలి అనుకున్న సాయి పల్లవి అనుకోకుండా ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది.అయితే సినిమాల్లో చేస్తూనే డాక్టర్ వృత్తిని కూడా మర్చిపోలేదు. అంతేకాదు సినిమాలేవీ లేకపోయినప్పుడు కచ్చితంగా మళ్ళీ డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తానని సాయి పల్లవి చెప్పుకొస్తుంది.
Sai Pallavi: Love for 10 years..He is the dream boy
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోని ప్రతిష్టాత్మమైన ప్రాజెక్టు అయిన బాలీవుడ్ రామాయణ్ మూవీలో నటిస్తోంది.ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే తెలుగులో కూడా నాగచైతన్యతో తండేల్ మూవీ లో చేస్తోంది. (Sai Pallavi)
అయితే అలాంటి సాయి పల్లవి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన ఒక రహస్యమైన విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సాయి పల్లవి 10 ఏళ్లుగా ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ ని బయట పెట్టింది.మరి ఇంతకీ సాయిపల్లవి పదేళ్లుగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి 10 సంవత్సరాలుగా రిలేషన్ పెట్టుకుంది లవ్ చేస్తుంది ఎవరినో కాదు అర్జునుడి కొడుకు అభిమాన్యుడు.
అవును వినడానికి సిల్లీగా అనిపించినప్పటికీ ఇదే నిజమట. ఎందుకంటే ఈ విషయాన్ని సాయి పల్లవే చెప్పింది.అంతేకాదు అభిమన్యుడు తన డ్రీమ్ బాయ్ అని కూడా చెప్పింది. దాదాపు పది సంవత్సరాల నుండి అభిమన్యుడిని గాఢంగా ప్రేమిస్తున్నాను అని సాయి పల్లవి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది సాయి పల్లవి మాటలు చూసి నవ్వుకుంటున్నారు.(Sai Pallavi)