Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేవలం బాలీవుడ్ సినీ ప్రియులకు మాత్రమే కాకుండా సౌత్ సినీ ప్రియులకు కూడా సూపరిచితమే.ఈయన ప్రభాస్ ఆది పురుష్ మూవీ లో రావణాసురుడి పాత్ర పోషించారు. అలా సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అయితే అలాంటి ఈ హీరో కరీనాకపూర్ ని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన మొదట అమృతా సింగ్ ని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేశారు.
Saif Ali Khan: Will I survive if I marry that heroine
ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ని రెండో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో ఉంటున్నారు. అయితే అలాంటి సైఫ్ అలీఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేను ఆ హీరోయిన్ ని చేసుకుంటే ఏమైపోయే వాడినో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఇక సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ కరీనాకపూర్ సోదరి కరిష్మా కపూర్ ని ఉద్దేశించి మాట్లాడారు. (Saif Ali Khan)
Also Read: బిగ్ బాస్ 8 ఆ హాట్ బ్యూటీ తో పాటు 2 స్టార్ హీరోయిన్స్.. రచ్చ మాములుగా ఉండదు.!!
అయితే కరీనాకపూర్ ని పెళ్లి చేసుకోక ముందే కరిష్మా కపూర్ తో సైఫ్ అలీఖాన్ చాలా సినిమాల్లో నటించారు. అలా వీరిద్దరి మధ్య మంచి బంధం ఉంది.అయితే ఈ విషయం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కరీనాకపూర్ ని చేసుకున్నాను కాబట్టి ఏం కాలేదు.కానీ కరీనా అక్క కరిష్మా కపూర్ ని చేసుకుంటే మాత్రం నా జీవితం ఏమైపోయేదో.
ఇద్దరం ఏసి రిమోట్ దగ్గర,టీవీ రిమోట్ దగ్గర ఎన్నిసార్లు గొడవ పెట్టుకునే వాళ్ళమో. అంతేకాదు రోజుకు ఒక్కసారైనా మా మధ్య గొడవలు వచ్చేవి.అలా పెళ్లయితే ఎన్ని సార్లు కొట్టుకునే వాళ్ళమో.టైం గార్డ్ మంచి పని అయింది అంటూ ఫన్నీగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Saif Ali Khan)