Ms Dhoni: మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. క్రీజులోకి అడుగు పెట్టాడంటే ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి వీడ్కోలు పలికిన ధోని కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నారు. ధోని కెరీర్ లో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు ఎనలేని విజయాలను అందించిన ధోని క్రికెట్ ద్వారా భారీగానే డబ్బులను సంపాదించాడు. Ms Dhoni

Sakshi Dhoni picture of smoking during her Greece holiday has left netizens upset

అంతేకాకుండా వ్యాపారాలు, యాడ్స్ ద్వారా భారీగానే డబ్బులను సంపాదిస్తున్నాడు. గతంలో ధోని ఓ వీడియోలో తన స్నేహితులతో కలిసి హుక్కా తాగుతూ కనిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసింది. ఈ వీడియోపై చాలా రకాలుగా చర్చలు జరిగాయి. ఓ గొప్ప క్రికెటర్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడమేంటని పలువురు కామెంట్లు చేశారు. అయితే అది ఓ యాడ్ షూట్ కోసం అని తర్వాత తెలిసింది. Ms Dhoni

Also Read: Deepthi Jeevanji: దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ !

దీంతో ధోని అభిమానులు అంతా రిలాక్స్ అయ్యారు. ఇదిలా ఉండగా…. ప్రస్తుతం ధోనీ భార్య సాక్షి సింగ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోలో సాక్షి స్మోకింగ్ చేస్తూ కనిపించారు. కరిష్మా తన్నా తన సోషల్ మీడియాలో గ్రీస్ ట్రిప్ లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలలో సాక్షి స్మోకింగ్ చేస్తూ కనిపించారు. సాక్షి సింగ్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఫోటోలలో కనిపించారు. ఇంతకుముందు కూడా సాక్షి సింగ్ స్మోకింగ్ చేస్తూ కనిపించారని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. Ms Dhoni

ఈ విషయంపై సాక్షి సింగ్ ఇప్పటివరకు రెస్పాండ్ అవలేదు. ఇదిలా ఉండగా….ధోని, సాక్షి వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ఫోటోలను పోస్ట్ చేయరు. వారి మిత్రుల ద్వారా మాత్రమే కొన్ని ఫోటోలు బయటకు వస్తాయి. ఇప్పుడు అలాంటి ఫోటోలే వారికి ఇబ్బందిగా మారుతున్నాయి. సాక్షి సింగ్ స్మోకింగ్ పిక్చర్ పై నెటిజన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల మీ అభిమానులు కూడా ఇలాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారేమోనని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. Ms Dhoni