Samantha Missed Out on a Blockbuster Bollywood Debut

Samantha: సమంత అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార, తన నటనతో, ఆకర్షణతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. సినిమాలు కూడా ఘన విజయం సాధించడంతో సమంత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఎంతో తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, కెరీర్ ప్రారంభంలోనే సమంత ఒక హిందీ సినిమాను రిజెక్ట్ చేసింది, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. ఆ సినిమా ఏమిటో తెలుసుకుందాం.

Samantha Missed Out on a Blockbuster Bollywood Debut

కొన్నేళ్ల క్రితం హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా గురించి అందరికీ తెలుసు. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించి, తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో, ఆలియా తక్కువ కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు అని చెప్పవచ్చు.

Also Read: Venkatesh: వెంకటేష్ అంత పెద్ద సాయం చేస్తే త్రివిక్రమ్ పట్టించుకోవడం లేదేంటి!!

అయితే, ఈ సినిమాలో మొదట సమంతనే హీరోయిన్‌గా ఎంచుకోవాలని నిర్మాతలు భావించారట. సమంతను సంప్రదించినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకోలేదట. దాంతో, ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆ నిర్ణయం తర్వాత బాలీవుడ్‌లో ఆలియాకు మంచి క్రేజ్ వచ్చింది.

ఈ వార్త వెలుగులోకి రావడంతో, సమంత ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో నటించి ఉంటే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇప్పటివరకు రాణించేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.