Samantha Reacts to Konda Surekha Comments Again

Samantha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత మరోసారి స్పందించారు. ఆమె మాట్లాడుతూ, తన చుట్టూ ఉన్న వారి ప్రేమ, నమ్మకమే కష్ట సమయంలో తనకు బలాన్నిచ్చాయని, ఆ మద్దతు వల్లే ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించగలిగానని తెలిపారు. తన తాజా వెబ్ సిరీస్ “సిటాడెల్: హనీ బన్నీ” ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

Samantha Reacts to Konda Surekha Comments Again

కొండా సురేఖ వ్యాఖ్యల గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత, “ఈరోజు నేను ఇక్కడ కూర్చోవడానికి కారణం నా చుట్టూ ఉన్న వారే. ఇండస్ట్రీలోని ప్రముఖుల ప్రేమ, నమ్మకమే నాకు బలాన్నిచ్చాయి. వాళ్లు నా వెన్నుదన్నుగా నిలబడకపోతే ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేది” అని చెప్పుకొచ్చారు.

Also Read: Nidhhi Agarwal: ఒకేసారి ఇద్దరు హీరోలతో ఆపనిచేసిన నిధి అగర్వాల్!!

ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ, ద్వేషపూరిత సందేశాలను లైట్ తీసుకుంటానని, వాటి ప్రభావం తనపై పడకుండా జాగ్రత్తగా ఉంటున్నానని సమంత అన్నారు. “సిటాడెల్” సిరీస్ గురించి మాట్లాడుతూ, మొదట ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి నిరాకరించానని, తనకు స్పై పాత్ర సూట్ కాదని భావించానని తెలిపారు.

“రాజ్ అండ్ డీకే ఈ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు, నాకు బదులు నలుగురు హీరోయిన్ల పేర్లు కూడా సూచించాను. కానీ వాళ్లు వినకుండా నన్నే ఎంపిక చేశారు” అని సమంత చెప్పింది. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో సమంత స్పై ఏజెంట్‌గా, వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.