Samantha: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో… హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకుల అంశం… హాట్ టాపిక్ గా మారింది. దీనికి కొండా సురేఖ కారణం. అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులకు కల్వకుంట్ల తారక రామారావు కారణమంటూ మంత్రి కొండా సురేఖ పేర్కొనడమే… దీనికి మూలం. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. అక్కినేని కుటుంబం నుంచి గట్టిగానే కౌంటర్ వస్తోంది. Samantha
Samantha Reacts To Konda Surekha’s Vulgar Comment
ముఖ్యంగా సమంత… కొండ సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్కినేని నాగచైతన్య అలాగే తన విడాకుల అంశం… మా ఇద్దరి వ్యక్తిగతమని ప్రకటించారు. ఈ విడాకుల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె పేర్కొనడం జరిగింది. అనవసరంగా కొండా సురేఖ తమ వివాదాన్ని రాజకీయాల్లోకి లాగారని మండిపడ్డారు. Samantha
Also Read: Kolikipudi Srinivas Rao: రైతులను కుక్కలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే..రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!!
తన విడాకుల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు సమంత. తన విడాకుల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని తేల్చి చెప్పారు. అనవసరంగా తన గురించి రాజకీయాల్లోకి లాగకూడదని కోరారు. అటు అక్కినేని నాగార్జున కూడా ఈ అంశం పైన స్పందించారు. కొండా సురేఖ ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబం గురించి రాజకీయాల్లోకి లాగకూడదని కోరారు. Samantha