Samantha: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి దశాబ్ద కాలం దాటుతున్న కూడా కొంతమంది హీరోయిన్లకు వరుస సినిమా అవకాశాలు వస్తూనే ఉంటాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సదరు ముద్దుగుమ్మలు కేరాఫ్ అడ్రస్ గా నిలబడుతూ తమ కెరియర్ను ఇంకా ఇంకా కొనసాగిస్తూ వస్తూనే ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు సమంత. ఈమె నటించిన మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు రావడంతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
Samantha: Remaining a Top Star Despite Challenges
ప్రస్తుతం కొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకు వస్తూ అలరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈమెకు సంబంధించిన రెమ్యునరేషన్ హీరోలతో సమానంగా ఉండడం అంతట చర్చనీయాంశం అవుతుంది. గత 15 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఇంతటిస్తాయి హీరోయిన్ గా మారింది ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. మధ్యలో కొన్ని రోజులు అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకోగా ఇప్పుడు మళ్లీ ఆమె కెరియర్ గాడిలో పడ్డట్లే అని చెప్పాలి.
Also Read: Janhvi Kapoor: జాన్వీ ని బాలీవుడ్ కంటే ఎక్కువ వాడుతున్నారా!!
హాలీవుడ్ చిత్రాలలో సైతం ఆమెకు అవకాశాలు రావడం విశేషం. అయితే ఆమెకు ప్రస్తుతం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటుందని చెప్పాలి. ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. సమంత ఇప్పుడు ఒక్కో సినిమాకి గాను దాదాపు పది కోట్లు తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం ఆమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని చెబుతున్నారు.
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఏ హీరోయిన్ కు ఇంతటి పెద్ద మొత్తం రాలేదని చెప్పాలి. కొందరు మీడియం రేంజ్ హీరోలకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ లు ఉండవు. అలాంటిది సమంతకు ఇంతటి స్థాయిలో రెమ్యునరేషన్ అంటే చెప్పుకోదగ్గ విషయమే. ఈ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత ఆమె అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు