Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు.. గత పది సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే అక్కినేని వారసుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది. అలా వీరి బంధం మంచిగా కొనసాగుతున్న తరుణంలో వీరి మధ్య ఏదో వివాదం పుట్టి విడాకులు తీసుకొని విడిపోయారు.
Samantha Second marraige
ఇక అప్పటినుంచి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. నాగచైతన్య త్వరలోనే శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఖాళీగా ఉన్న సమంత తాజాగా ఆ స్టార్ తో ప్రేమలో పడిందని తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి భాజలు కూడా మోగబోతున్నాయట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే బాలీవుడ్ బడా నిర్మాత బోనికపూర్ కొడుకు అర్జున్ కపూర్. వీరిద్దరు గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని ఈమె బోనీ కపూర్ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందంటూ బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.(Samantha)
Also Read: Bunny: పాపం..బన్నీ ఎప్పటికీ తీరని కోరిక.. సీక్రెట్ బయటపెట్టి కన్నీళ్లు..?
అంతేకాదు అర్జున్ తన ప్రియురాలు మలైకా ఆరోరాకీ బ్రేకప్ కూడా చెప్పారట. అంతే కాదు ఆయన నేను సింగిల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం బయటకు వచ్చిన కొద్ది రోజులకే, సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఉపాందుకున్నాయి. సమంతతో లవ్ లో పడ్డ తర్వాతే మలైకాకు బ్రేకప్ చెప్పాడని, అంతేకాకుండా సమంత తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక కవితను పోస్టు చేస్తే దానికి రిప్లై గా , సమంతాని చూస్తే చాలా ఆదర్శంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు.
ఇలా సమంతాను చూసి ఎక్కడ ఆకర్షితుడయ్యాడో ఏమో కానీ వీరి మధ్య మాత్రం లవ్ కొనసాగుతుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు పెళ్లికి కూడా సిద్ధమైనట్టు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఈ వార్తలపై సమంత అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తారో ముందు ముందు తెలుస్తుంది.(Samantha)