Samudrudu

Samudrudu: కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై బధావత్ కిషన్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్‌ “సముద్రుడు” సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా, సుమన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Samudrudu movie grand releasing on Oct 25th

ఈ సినిమా మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ, వారి జీవన పోరాటం, సముద్రంపై ఆధారపడిన వారి కష్టాలు, ప్రభుత్వ ఆంక్షల వల్ల ఎదురయ్యే సవాళ్లను ప్రధాన అంశాలుగా చూపించబోతుంది. సినిమా యూనిట్ ప్రకారం, సుమన్ యాక్షన్ సీక్వెన్సులు, కామేడీ దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని తెలిపారు.

Also Read : Guntur Kaaram Failure: గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలివే.. నిర్మాత నాగవంశీ!!

తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్ తదితరులు పాల్గొన్నారు. “మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తుందని” దర్శకుడు నగేష్ నారదాసి తెలిపారు.

నిర్మాత బధావత్ కిషన్ మాట్లాడుతూ, “సముద్రుడు” సినిమా ప్రేక్షకుల కోసం సిద్ధమైందని, ఇందులో యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ సమకూర్చబడ్డాయన్నారు. సుమన్ పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, కథలో దమ్ముంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “మా కథలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

https://twitter.com/pakkafilmy007/status/1846888267926454411